ఇప్పడు హీరోల ట్రెండ్ మారింది. ఎప్పుడూ ఒకటే గెటప్ లో కనిపించడం అన్నది మానేసారు. సినిమా సబ్జెక్ట్ ను బట్టి కొత్తగా ట్రయ్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే సినిమాకు కాస్త యంగ్ గా కనిపించిన హీరో కళ్యాణ్ రామ్, లేటెస్ట్ సినిమా 'నా నువ్వే'కు ఫుల్ యూత్ గా మారాడు. సినిమాలో ఎలా వుంటాడో కానీ, ఇప్పటి వరకు విడుదల చేసిన స్టిల్స్ అయితే మాత్రం, భలేగా వున్నాడు కళ్యాణ్ రామ్ అని అనుకునేలా చేసాయి.
ఈ సినిమా ఫినిష్ చేసిన కళ్యాణ్ రామ్ తన తరువాత సినిమా మళ్లీ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం మీదే స్టార్ట్ చేసాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ది కాస్త రఫ్ క్యారెక్టర్. పైగా కొద్దిగా యాక్షన్ సీన్లు వుంటాయి. అందుకే మళ్లీ కొత్త గెటప్ ట్రయ్ చేస్తున్నాడు.
లైట్ గా గెడ్డంతో, రఫ్ లుక్ వుండేలా కళ్యాణ్ రామ్ మేకోవర్ అయ్యాడు. ఈ మేరకు బయటకు వచ్చిన స్టిల్ సోషల్ నెట్ వర్క్ లో తిరుగుతోంది. చూసిన వాళ్లు జోనర్ కు తగినట్లు కళ్యాణ్ రామ్ చూపిస్తున్న తపన ఓకె. అయితే ఇదేదో పదేళ్ల కిందటే చేసి వుంటే, ఈపాటికి మంచి పొజిషన్ లో వుండేవాడు అని అంటున్నారు.