చిరు ప్రసంగం తప్ప వేరేమీ లేదు.

గుప్పిట మూస్తే ఏముందో అన్న గుసగుసలు. తెరిస్తే ఏమీ వుండదు. కానీ తెరవరు. దాంతో దాని మీద గ్యాసిప్ లే గ్యాసిప్ లు. నిన్నటికి నిన్న జరిగిన తెలుగు హీరోల సమావేశం ఇలాంటిదే. ఈ…

గుప్పిట మూస్తే ఏముందో అన్న గుసగుసలు. తెరిస్తే ఏమీ వుండదు. కానీ తెరవరు. దాంతో దాని మీద గ్యాసిప్ లే గ్యాసిప్ లు. నిన్నటికి నిన్న జరిగిన తెలుగు హీరోల సమావేశం ఇలాంటిదే. ఈ సమావేశం వివరాలు ఇలా వున్నాయి. ఇవి విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించినవి. అంతే కానీ గ్యాసిప్ వార్తలు కావు.

సుమారు ముఫ్పావు గంట నుంచి గంట వరకు ఈ సమావేశం అన్నపూర్ణలో జరిగింది. ఈ సమావేశానికి బాలయ్య, నాగార్జున, ప్రభాస్ హాజరు కాలేదు. నాగ్, ప్రభాస్ వేరే ఊళ్లలో వుండడం వల్ల రాలేదని సమావేశంలో చెప్పారు. కానీ బాలయ్య ప్రస్తావన లేదు. అలాగే ఈ సమావేశంలో చెప్పుకోదగ్గ ఇంకో కీలక విషయం ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్–మీడియా వ్యవహారం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.

నిజానికి ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడితే అంతా. మహేష్ బాబు లాంటి ఒకరిద్దిరు మాత్రం, అవును.. అలాగే.. తప్పుకుండా.. ఇకపై ఎప్పుడు పిలిచినా మీటింగ్ లకు వస్తాం, అని తప్ప, వారి అభిప్రాయాలు అంటూ వేరే ప్రత్యేకంగా వెలిబుచ్చలేదు.

ఇక మెగాస్టార్ చెప్పింది కీలకంగా ఒకటే. ఎవరికి సమస్య వస్తే, వాళ్లే కిందా మీదా అవుతున్నారు. మిగిలిన వారు సైలెంట్ అవుతున్నారు. ఇది సరి కాదు. ఎవరికి సమస్య వచ్చినా అందరం రెస్పాండ్ కావాలి. మనం అంతా ఓ కుటుంబంలా కలిసి వుండాలి. మొన్న ఇండస్ట్రీ మీట్ లో ఇలాగే అనుకున్నాం. మనం కూడా అలాగే అనుకోవాలి. కలిసి వుండాలి.

అంతే కానీ ఎవరికి సమస్య వస్తే వాళ్లు రెస్పాండ్ కావడం కాదు. ఇదీ మెగాస్టార్ చెప్పింది. దాదాపు ఇవే పాయింట్లు, తిప్పి తిప్పి, మళ్లీ మళ్లీ చెప్పారు. కానీ ఎక్కడా ఇప్పటి దాకా జరుగుతున్న మీడియా వ్యవహారాల గురించి మాత్రం ప్రస్తావించలేదు. అసలు బ్యాన్ అన్న దాన్నే మాట్లాడలేదు. ఇకపై ఎప్పుడు సమావేశం పెట్టినా వస్తానని మహేష్ బాబు అన్నారు.

సమావేశానికి హాజరయిన వారిని కింద నుంచి మీదకు తీసుకెళ్లడం, కో ఆర్డినేట్ చేయడం అన్న పనులు డైరక్టర్ మెహర్ రమేష్ నిర్వహించారని తెలుస్తోంది. మెహర్ రమేష్ ఇటు మెగా కుటుంబానికి, అటు మహేష్ బాబుకు సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే.