పవర్ స్టార్ బుక్కయిపోయారా?

పాపం, జనసేన అధిపతి అడ్డంగా బుక్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఏరి కోరి భారీగా జీతాలు ఇచ్చి మరీ తెచ్చుకున్న మీడియా జనాలు ఎవరో కానీ, ఆయనను పూర్తిగా తప్పుదారి పట్టించేసినట్లే వుంది. Advertisement…

పాపం, జనసేన అధిపతి అడ్డంగా బుక్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఏరి కోరి భారీగా జీతాలు ఇచ్చి మరీ తెచ్చుకున్న మీడియా జనాలు ఎవరో కానీ, ఆయనను పూర్తిగా తప్పుదారి పట్టించేసినట్లే వుంది.

ఓ టీవీ ఛానెల్ లో ప్రసారం అయిన వీడియో అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అక్కడితో ఆగలేదు. ఆ వీడియోను వాళ్లకు వీళ్లకు ట్యాగ్ చేయడం, పంపడం చేసారు. సదరు వీడియో మీద ఆ చానెల్ లోగో కూడా వుంది.

అయితే ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఆ చానెల్ ఆ వీడియోను ప్రసారం చేసినపుడు, అందులో ఓ తిట్టు పదాన్ని మ్యూట్ చేసిందట. కానీ పవన్ షేర్ చేసిన వీడియోలో ఆ మ్యూట్ లేదు.

మరి ఏం జరిగినట్లు? ఇప్పుడు ఆ ఛానెల్ ఏమంటోంది? అంటే, యూట్యూబ్ లో శ్రీరెడ్డి ఘాటుగా పవన్ ను తిట్టిన వీడియోల్లోంచి ఆడియో ఫైల్ డౌన్ లోడ్ చేసి, దానిని ఈ చానెల్ వీడియోకి మార్పింగ్ చేసారని అంటోంది. అనడమే కాదు, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయించేసారు. ఈ మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ల తరపున పోలీసులకు ఫిర్యాదు అందింది.

మరో పక్క ఆ ఛానెల్ కూడా పవన్ పై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. అసలు ఇప్పుడు ఫైట్ మొత్తం ఆ చానెల్ కు పవన్ కు మధ్య అన్నట్లు మారిపోయింది. ఆ చానెల్ కీలక బాధ్యుల వ్యక్తిగత ఫోటోలు పెట్టడం, వాటి గురించి రాయడం వంటి చర్యలకు పవన్ పాల్పడుతున్నారు.

మరి ఇదంతా పవన్ నే చేస్తున్నారో? పవన్ సలహాతో ఆయన టీమ్ చేస్తున్న అత్యుత్సాహమో? లేక అసలు ఆ టీమ్ ఇస్తున్నతప్పుడు సలహానో? మొత్తానికి పవన్ ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది.