శ్రీరెడ్డిని చూసి కంగనా సైతం షాక్‌ అయ్యిందా?

కంగనా రనౌత్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. అంతేగాక జాతీయ ఉత్తమ నటిగా అవార్డులను సైతం అందుకున్న నేపథ్యం ఉంది. ఒక్కో సినిమాకు ఇప్పుడు భారీ పారితోషకాలు తీసుకుంటోంది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలు…

కంగనా రనౌత్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. అంతేగాక జాతీయ ఉత్తమ నటిగా అవార్డులను సైతం అందుకున్న నేపథ్యం ఉంది. ఒక్కో సినిమాకు ఇప్పుడు భారీ పారితోషకాలు తీసుకుంటోంది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలు చేయదగిన స్థాయిలో ఉంది. ఆమె పేరుతో సినిమాలు మార్కెట్‌ అవుతున్నాయి. దీంతో పారితోషకం కూడా కోట్లరూపాయల స్థాయిలో ఉంది. ఇలా కంగనా స్టార్‌డమ్‌ గురించి ఎంత చెప్పుకున్నా చాలదు.

ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఈ స్థాయికి వచ్చింది కంగనా. స్టార్‌గా వెలుగొందుతోంది. అలాంటి కంగనా, కొన్నాళ్ల కిందట సంచలన ఆరోపణలు చేసింది. అదేమిటంటే, తనను పలువురు బాలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు, హీరోలు శారీరకంగా వాడుకున్నారు అని ఆమె బహిరంగంగా ప్రకటించింది. మీడియా వర్గాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కంగనా ఈ విషయాలు చెప్పింది. కెరీర్‌ ఆరంభంలో తనను కొందరు సెక్సువల్‌గా వాడుకున్నారు అని కంగనా వివరించి చెప్పింది. అలా వాడుకున్న వాళ్లెవ్వరో కూడా ఆమె పేర్లతో సహా చెప్పింది.

ఫలానా ప్రొడ్యూసర్‌, ఫలానా హీరో, ఫలానా డైరెక్టర్‌ అని వివరించింది. వాళ్లు అవకాశాలు ఇస్తామనే మిషతో తనను శారీరకంగా వాడుకున్నారని, చివరకు మోసం చేశారని, సరైన అవకాశాలేవీ ఇవ్వలేదని కంగనా వివరించింది. తన బాధనంతా వెల్లబోసుకుంది. ఇదంతా జరిగి కొన్నినెలలు అవుతున్నాయి. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఒక అమ్మాయి ఈ ఆరోపణలు చేసింది. కెరీర్‌ ఆరంభంలో తనను శారీరకంగా వాడుకున్నారు, ఆల్మోస్ట్‌ నాపై అత్యాచారం చేశారు, అని కంగనా రనౌత్‌ బోరుమంది.

కట్‌చేస్తే, శ్రీరెడ్డి. అవే ఆరోపణలు. అవకాశాలు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు, సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌. ఏడుపులు, పెడబొబ్బలు. మొదట ఇలాంటి ఆరోపణలు చేసింది ఒక బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. కోట్ల రూపాయలు పారితోకం తీసుకుంటున్న నటి. తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి చెబితే, ఎవరెవరు వేధించారో కూడా చెబితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏదో ఒకటీరెండు రోజుల పాటు మీడియాలో దానిపై వార్తలు వచ్చాయి తప్ప, అంతకు మించి దానిపై చర్చాలేదు ఏమీలేదు.

కంగనా రనౌత్‌ వంటి స్టార్‌ హీరోయిన్‌ ఆరోపణలు చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ, అంతవరకూ ఎవరికీ తెలియని శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో మాత్రం ఒక పిల్మ్‌ ఇండస్ట్రీ షేక్‌ అవుతోంది. ఆమె ఆరోపణలను అంతర్జాతీయ పత్రికలు కూడా కవర్‌ చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్‌ టైమ్స్‌ లాంటి పత్రికలు కూడా ఈమె ఆవేదనను ప్రముఖంగా ప్రచురించాయి. మొదట్లో కంగనా చేసిన ఆరోపణలకూ, ఇప్పుడు శ్రీరెడ్డి చెబుతన్న మాటలకూ ఏమాత్రం తేడా లేదు.

శ్రీరెడ్డితో పోలిస్తే కంగనాకు ఉన్న గుర్తింపు ఆకాశమంతా. ఎక్కడ తేడా వచ్చిందో కానీ నన్ను వాడుకున్నారని కంగనా వాపోతే పట్టించుకున్న నాథుడులేడు. అవే ఆరోపణలను శ్రీరెడ్డి చేస్తే ఒక రేంజ్‌ గుర్తింపు. ఎక్కడ తేడా కొట్టిందో!