Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జీవితపై ఆమె ఆరోపణలు.. అసలు గొడవ వేరే?!

జీవితపై ఆమె ఆరోపణలు.. అసలు గొడవ వేరే?!

జీవిత- రాజశేఖర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఒక ప్రముఖ సామాజిక సేవకురాలు. ఈ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. అటు రాజశేఖర్‌ మీద, ఇటు జీవిత మీద అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఇవి. ఈ ఆరోపణల్లోని మొదటి అంశం రాజశేఖర్‌కు అమ్మాయిల పిచ్చి, రెండో అంశం అతడి పిచ్చిని తీర్చడానికి జీవిత రంగంలోకి దిగి అమ్మాయిలను సరఫరా చేస్తుంది. ఒక టీవీ చానల్‌ వేదికగా ఈ ఆరోపణలు చేసింది ఆ సామాజిక సేవకురాలు. అయితే ఇవి ఇప్పటి విషయాలు కావు అని సదరు సామాజిక సేవకురాలు చెప్పింది. ఎప్పుడో గతంలో జరిగింది అని ఆమె చెప్పుకొచ్చింది. గతంలో జరిగినప్పుడు, గతంలోనే విషయాలు బయటపెట్టాలి కదా, ఆ పని చేయలేదీమె.

సందడిలో సడేమియా అన్నట్టుగా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ప్రస్తావించింది. ఒకవైపు టాలీవుడ్‌లో సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ గురించి శ్రీరెడ్డి రచ్చ కొనసాగుతున్న తరుణంలో, దీనిపై పెద్దఎత్తున చర్చ నేపథ్యంలో ఈ సామాజిక సేవకి ఈ విషయాన్ని ప్రస్తావించింది. నిన్నటి వరకూ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ గురించి ప్రస్తావించడం ముసుగులో గుద్దులాట అనుకుంటే, శ్రీరెడ్డి వ్యవహారంతో ఇప్పుడు దీనిపై పేర్ల ప్రస్తావన కూడా వచ్చేసింది. ఈ రచ్చలో సదరు సామాజిక సేవకి జీవిత, రాజశేఖర్‌లపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 

దీనిపై జీవిత స్పందించేసింది. సదరు సామాజిక సేవకిపై, ఆ ఆరోపణలను ప్రసారం లైవ్‌లో ప్రసారం చేసిన చానల్‌పై ఆమె కేసుపెట్టారు. అందరి మీదా పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇదీ కథ. ఇదంతా పైకి కనిపిస్తున్న కథ. జీవిత, రాజశేఖర్‌లపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేయడం, దానిపై రియాక్షన్‌ రావడం చకచకా జరిగిపోయింది. జనాలు కూడా ఈ విషయాల గురించి బాగానే మాట్లాడుకున్నారు. ఏదినిజం? అంటే ఎవరూ చెప్పలేరు. కానీ గమనిస్తే కొన్ని పాత విషయాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఈ సామాజిక సేవకురాలికి, జీవితకు గతంలో డైరెక్టుగా కాకపోయినా ఇన్‌డైరెక్టుగా ఒక పరోక్ష యుద్ధం జరిగిందని ఇండస్ట్రీలో ఒక టాక్‌ ఉంది.

సెన్సార్‌ బోర్డు సభ్యత్వం విషయంలో ఈ సామాజిక సేవకి కొంత అసహనానికి గురి అయ్యారని, తను ఆశించిన పదవిని జీవిత తన్నుకుపోయిందని గతంలో ఆవేదన చెందిందని లోగొట్టు ఎరిగిన వాళ్లు అంటున్నారు. కొన్నాళ్ల కిందట జీవిత సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా నియమితం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సెన్సార్‌ బోర్డు సభ్యత్వాన్ని సదరు సమాజ సేవకురాలు ఆశించిందని సమాచారం. అప్పటికే తనకున్న గుర్తింపుతో లాబీయింగ్‌తో ఆమె సెన్సార్‌ బోర్డు సభ్యత్వం విషయంలో ప్రయత్నాలు చేసిందట. కానీ అప్పటికే బీజేపీ వైపు వెళ్లారు జీవితారాజశేఖర్‌. దీంతో వాళ్లకు జీవితకు అవకాశం దక్కింది. 

దీంతో ఆ సమాజసేవకురాలు తీవ్రంగా అసహనభరితం అయ్యిందట. అప్పటి నుంచి ఆమె దాన్ని మనసులోనే దాచుకుని, అదును చూసి జీవితపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్టుగా ఇండస్ట్రీలో ఒక టాక్‌ నడుస్తోంది. జీవితారాజశేఖర్‌ లాబీయింగ్‌ ఫోర్స్‌కు అప్పట్లో తట్టుకోలేకపోయిన ఆమె ఇప్పుడు తీవ్రమైన మాటలతో వారి రెప్యుటేషన్‌ను తీవ్రంగా దెబ్బతీసేయత్నం చేసిందని సినిమా జనాలు చర్చించుకుంటున్నారు. ఇది ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్‌. లోగుట్టు పెరుమాళ్లకెరుక!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?