అధికారికంగా కాకపోయినా, అనధికారికంగా అయినా వర్మపై వేటు తప్పకపోవచ్చు. ఇండస్ట్రీ మొత్తం అతడ్ని వెలివేయడం గ్యారెంటీ. పవన్ తల్లిపై వర్మ చేయించిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టాలీవుడ్ మొత్తం ఒక్కటైంది. నిర్మాతలు, దర్శకులు, నటీనటులంతా మెగా కాంపౌండ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ-అఖిల్ కాంబోలో రావాల్సిన సినిమాను ఆపేయడం మంచిదనే ఉద్దేశానికి నాగ్ వచ్చినట్టు తెలుస్తోంది.
అఖిల్ తో ఓ అద్భుతమైన సినిమా చేస్తానని వర్మ ఆమధ్య ప్రకటించాడు. అఖిల్ తో యంగ్ క్యూట్ లవ్ స్టోరీ తీయనని, హై ఎమోషనల్ యాక్షన్, రియలిస్టిక్ లవ్ సినిమా చేస్తానని ఏదేదో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఇప్పుడా సినిమా దాదాపు ఆగిపోయినట్టే.
నాగ్ నటించిన ఆఫీసర్ సినిమాకే దిక్కులేదు. అసలే ప్రీ-రిలీజ్ జరగక ఇబ్బందుల్లో ఉన్న ఈ సినిమా, వర్మ చేసిన తింగరి పనితో మరింత సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోయింది. ఇలాంటి టైమ్ లో అఖిల్ ను హీరోగా పెట్టి వర్మ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా నిర్మిస్తే, ఇండస్ట్రీ మొత్తం నాగ్ ను టార్గెట్ చేస్తుంది. నాగార్జున అంతవరకు తెచ్చుకోడు.
అఖిల్-వర్మ సినిమాపై ఈరోజు లేదా రేపు నాగ్ ఓ ప్రకటన చేయబోతున్నాడు. మెగా కాంపౌండ్ కు మద్దతు తెలుపుతూనే, అఖిల్ సినిమాపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేలా నాగ్ ట్వీట్ చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది.