తెలుగు సినిమాకి నంబర్‌వన్ మాట ఎలా వున్నా, మెగా ఫ్యామిలీలో లేటెస్ట్ జనరేషన్ హీరోల్లో నంబర్‌వన్ అనిపించుకునే దిశగా అల్లు అర్జున్ ఒక్కో హిట్టూ కొట్టుకుంటూ పోయాడు. అతను కూడా ఈమధ్య మాస్ సినిమాలంటూ మూసలో పడిపోయినా కానీ చరణ్ కంటే బెటర్ రిజల్ట్స్ సాధిస్తూ రావడం ప్లస్ అయింది. అయితే అదంతా చరణ్ ఫామ్‌లోకి రానంత వరకే.
హిట్ టాక్ వస్తే చరణ్ సినిమా ఏ రేంజ్‌కి వెళుతుందనేది రంగస్థలం నిరూపించింది. అల్లు అర్జున్ సినిమాకి ఖచ్చితంగా ఇంత రేంజ్ అయితే రాదు. దీనిని బట్టే స్టార్‌డమ్ పరంగా, రీచ్ పరంగా చరణ్ వేరే లెవల్ అని తేలిపోయింది. అల్లు అర్జున్ నిలకడగా హిట్లు ఇచ్చినా, మగధీర, రంగస్థలం లాంటి కళ్లుచెదిరే బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం చరణ్ వల్లే అవుతుందని ప్రూవ్ అయింది.
సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ నడుస్తున్నా కానీ అల్లు అర్జున్‌ని 'రంగస్థలం' ఒత్తిడిలోకి నెట్టింది. చరణ్ స్లో అయినపుడు ఫ్యాన్స్ తనవైపు పే చేసే అటెన్షన్ కంటే ఇప్పుడు తక్కువే వుంటుంది కనుక 'డిజె'లాంటి యావరేజ్ సినిమాలతో ఓపెనింగ్స్ రాబట్టుకుని మ.మ. అనిపించేసుకోవడం, హిందీలోకి డబ్ అయిన తన సినిమాలు యూట్యూబ్ రికార్డులు సాధించాయని చెప్పుకోవడం మాత్రం సరిపోదు. రంగస్థలం మాదిరిగా గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ ఇవ్వాల్సిన ప్రెజర్‌లో 'నా పేరు సూర్య'తో అల్లు అర్జున్ ఏ స్థాయి విజయం అందుకుంటాడనేది ఇంట్రెస్టింగ్.