Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు చేతిలో 'ఆచారి'

దిల్ రాజు చేతిలో 'ఆచారి'

ఆచారి అమెరికా యాత్ర సినిమా విడుదలకు మరో వారం మాత్రమే సమయం వుంది. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమాను ఉభయ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. ఛల్ మోహన్ రంగ విడుదల సందర్భంగా దిల్ రాజు ఆచారి సినిమాకు మాట ఇవ్వడం ఒక రీజన్ అని తెలుస్తోంది.

అయితే మరో రీజన్ కూడా వుందని వినికిడి. గతంలో ఎప్పుడో ఆచారి సినిమా నిర్మాతలకు దిల్ రాజుకు లావాదేవీలు వున్నాయట. ఆ మేరకు దిల్ రాజుకు ఆచారి నిర్మాతల పాత బాకీలు వున్నాయని వినికిడి. దాంతో ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకుని, ఉభయ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆచారి అమెరికా యాత్ర బాగానే వచ్చిందని, ఫన్ పండిందని ఇండస్ట్రీలో వార్తలు వున్నాయి. విష్ణు-నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లో ముస్తాబయిన ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషించారు. సమ్మర్ లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నవ్వించే సినిమా రాలేదు. ఆ లోటు ఆచారి తీరుస్తుందేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?