Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని బిగ్ బాస్ ఫీజు 3.5 కోట్లు

నాని బిగ్ బాస్ ఫీజు 3.5 కోట్లు

బిగ్ బాస్ సీజన్ 2కు హోస్ట్ గా హీరో నాని ఫిక్సయిపోయాడు. అయితే బిగ్ బాస్ షో అంటే రెమ్యూనిరేషన్ కాస్త భారీగానే వుంటుంది. ఎన్టీఆర్ కు సీజన్ వన్ కు ఎనిమిది కోట్ల వరకు ఇచ్చినట్లు వార్తలు వినవచ్చాయి. మరి ఇప్పుడు నానికి ఎంత ఇస్తున్నట్లు?

నాని ప్రస్తుతం ఏడు నుంచి తొమ్మిది కోట్ల వరకు సినిమాను బట్టి పారితోషికం తీసుకుంటున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2కి నానికి మూడున్నర కోట్లు రెమ్యూనిరేషన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

కేవలం వారానికి రెండు రోజులు మాత్రనే నాని ఈ షో చేయాల్సి వుంటుంది. మొత్తం మీద చూసుకున్నా గట్టిగా నెల రోజులు వర్క్ వుండదు. ఓ సినిమా చేస్తే నాని అరవై రోజుల వరకు కేటాయించాల్సి వుంటుంది.

అందువల్ల అలా చూసుకుంటే ప్రస్తుతం తీసుకుంటున్న ఏడు నుంచి తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ లెక్కల ప్రకారం ఫిక్స్ చేసి వుంటారు. మూడున్నర కోట్లు ఆ విధంగా నానికి లాభమే అనుకోవాలి. పైగా బిగ్ బాస్ షో అంటే ఆ క్రేజ్ వేరు కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?