శ్రీని రాజు లీగల్ నోటీస్?

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు పారిశ్రామిక వేత్త శ్రీని రాజు లీగల్ నోటీసు ఇవ్వబోతున్నారా? టాలీవుడ్ సర్కిళ్లలో ఈ మేరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీ 9 అధినేత, పారిశ్రామిక వేత్త శ్రీని రాజు,…

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు పారిశ్రామిక వేత్త శ్రీని రాజు లీగల్ నోటీసు ఇవ్వబోతున్నారా? టాలీవుడ్ సర్కిళ్లలో ఈ మేరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీ 9 అధినేత, పారిశ్రామిక వేత్త శ్రీని రాజు, టీవీ 9 రవి ప్రకాష్, నారా లోకేష్  మరి కొందరు రామ్ గోపాల్ వర్మతో కలిసి తనపై కుట్ర చేసారని పవన్ పదే పదే ట్వీట్ లు చేసారు.

అయితే ఇందుకు సాక్ష్యాధారాలు ఏమీ లేవనే అనుకోవాలి. కేవలం ఎవరో చెప్పిన దానిని బట్టో, లేక, తెలిసిన విషయాలను బట్టో పవన్ ఈ మేరకు ఆరోపించి వుండాలి. 

అందుకే పవన్ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని, లేదా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటూ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు ఇచ్చే ఆలోచనను శ్రీని రాజు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదేమంత ఇబ్బంది పెట్టే చర్య కాదు. పవన్ కు కానీ, జనసేనకు కానీ లీగల్ టీమ్ అనేది వుంటుంది. వాళ్లు చూసుకుంటారు.

అయితే పవన్ ఆరోపణలను నిరాధారం అని తేల్చడానికి మాత్రం ఇది ఉపయోగపడే అవకాశం వుంటుంది.