రంగస్థలం నుంచి స్పూర్తి పొందిన భరత్

మొన్నటికిమొన్న 3 గంటల నిడివి కలిగిన రంగస్థలాన్ని భరించడం కష్టమన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సెకెండాఫ్ ట్రిమ్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్స్ పడ్డాయి. కానీ యూనిట్ మాత్రం తగ్గలేదు. ఆ నమ్మకమే…

మొన్నటికిమొన్న 3 గంటల నిడివి కలిగిన రంగస్థలాన్ని భరించడం కష్టమన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సెకెండాఫ్ ట్రిమ్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్స్ పడ్డాయి. కానీ యూనిట్ మాత్రం తగ్గలేదు. ఆ నమ్మకమే నిజమైంది. 3 గంటల సినిమాని కదలకుండా చూస్తున్నారు జనాలు. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను 'భరత్' కూడా ఫాలో అవుతున్నాడు. 

భరత్ అనే నేను సినిమా నిడివి కూడా దాదాపు 3 గంటలుంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 53 నిమిషాలు. సినిమాలన్నీ రెండున్నర గంటల్లోనే ముగుస్తున్న ఈ టైమ్ లో 3 గంటల నిడివితో వస్తోంది మహేష్ మూవీ. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉంది. 

పక్కా ఎమోషనల్ కంటెంట్ తో వస్తోందట భరత్ అనే నేను సినిమా. ఆడియన్స్ ఒక్కసారి కనెక్ట్ అయితే ఇక నిడివి ఎంతుందనే విషయంతో సంబంధంలేదని యూనిట్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా సినిమా సెకెండాఫ్ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫ్లో ఎక్కడా దెబ్బతినదట. అందుకే సినిమా నిడివి గురించి యూనిట్ ఆలోచించలేదని తెలుస్తోంది. సరిగ్గా రంగస్థలం విషయంలో కూడా ఇదే జరిగింది. 

జనతా గ్యారేజ్ టైపులో భరత్ అనే నేను సినిమాలో కూడా క్లయిమాక్స్ కు ముందు ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. జనతా గ్యారేజ్ టైమ్ లో కాజల్ తో స్పెషల్ సాంగ్ కు ఒప్పుకున్న కొరటాల.. ఈసారి మాత్రం అలాంటి ఆలోచనలేం పెట్టుకోలేదు. కేవలం కంటెంట్ పై నమ్మకంతో ఓ సీరియస్ మూవీకి 3 గంటల నిడివి లాక్ చేశాడు. కొరటాల నమ్మకం ఎంత నిజమౌతుందో మరో 3 రోజుల్లో తేలిపోతుంది.