టాలీవుడ్ వ్యవహారాలు రానురాను రచ్చ కెక్కతున్నాయి. అయితే ఆరోపణలు చేస్తున్న వారు హద్దులు దాటి, తిట్లు లంకించుకుంటున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మాటకు మాట అంటూ ఈ వ్యవహారాన్ని పెంచే కన్నా, లీగల్ గా పోరాటం చేయడం బెటర్ అనే నిర్ణయానికి టాలీవుడ్ జనాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎంత పబ్లిక్ ఫ్లాట్ ఫారమ్ మీద వున్నా, రాజకీయాల్లో వున్నా, వ్యక్తిగత దూషణ అన్నది సరికాదు అని సర్వత్రా వినిపిస్తోంది. దీనికి చట్టాలు కూడా సమర్థించవు. అందువల్ల ఆ దిశగానే పోరు చేయడం బెటర్ అని టాలీవుడ్ లో కొందరు పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికి జీవిత రాజశేఖర్ కొన్ని లీగల్ నోటీసలు రెడీ చేసినట్లు బోగట్టా. నటి జీవిత తన భర్తకు తానే అమ్మాయిలను పంపించిందని పబ్లిక్ గా ఆరోపించారు మహిళా సంఘాల నేతలు. అయితే దీనికి జీవిత రాజశేఖర్ చాలా బాధపడినట్లు తెలుస్తోంది.
ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయిన ఆమె తనపై వచ్చిన ఆరోపణలకు చాలా ఆగ్రహంగా వున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ ఆరోపణలకు ఆధారాలేమిటి? వాటి వ్యవహారం ఏమిటి తేల్చమని, జీవిత రాజశేఖర్ కోర్టును కోరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని లీగల్ నోటీసులు రెడీ చేసినట్లు వినిపిస్తోంది.
ఈ బాటనే మరి కొందరు టాలీవుడ్ జనాలు కూడా తమ తమ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోపక్క న్యూస్ చానెళ్లు అదే పనిగా టాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నందున, వాటికి కంటెంట్, ఇతరత్రా సహాయం ఎందుకు చేయాలని, కౌన్సిల్, చాంబర్ లపై వత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్, చాంబర్ పెద్దలను వత్తిడి చేస్తున్నట్ల బోగట్టా.