ఓవైపు తను పెళ్లి చేసుకోనంటూ సల్మాన్ ఖాన్ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయన పెళ్లిపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి కండలవీరుడిపై పెళ్లిపై వార్తలు మొదలయ్యాయి. తనకు మరోసారి క్లోజ్ అయిన కత్రినాకైఫ్ ను ఈసారి సల్మాన్ ఖాన్ వదులుకోడని, ఆమెనే వరిస్తాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
మొన్నటికిమొన్న 2రోజులు జైళ్లో ఉండి వచ్చాడు సల్మాన్ ఖాన్. కృష్ణజింకలు వేటాడిన కేసులో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించడం, ఆ వెంటనే బెయిల్ పై రావడం జరిగిపోయాయి. అయితే ఈ ప్రాసెస్ లో అతడు 2రాత్రిళ్లు జైలులో గడపాల్సి వచ్చింది. అదే టైమ్ లో కత్రినాకైఫ్ సల్మాన్ కోసం ప్రత్యేక పూజలు చేసింది. బెయిల్ పై ఇంటికొచ్చిన సల్మాన్ కు సపర్యలు కూడా చేసింది. ఒక రోజుంతా సల్మాన్ ఇంట్లోనే ఉండిపోయింది.
సల్మాన్, కత్రిన మధ్య బంధం ఎంత దృఢంగా ఉందనే విషయాన్ని తాజాగా జరిగిన ఈ సంఘటనలు తెలియజెప్పాయి. దీంతో ఈ జంట ఈసారి పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అనే రూమర్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్న కత్రినాకైఫ్, ఇకపై సల్మాన్ అంగీకారంతోనే సినిమాలకు సైన్ చేయబోతోందట.
కత్రినాకైఫ్ కు లైఫ్ ఇచ్చిన వ్యక్తి సల్మాన్ ఖాన్. ఆమెను బాలీవుడ్ లో నిలదొక్కుకునేలా చేశాడు. తనే స్వయంగా సిఫార్స్ చేసి ఎన్నో అవకాశాలిచ్చాడు. అలాంటి టైమ్ లో కొన్ని మనస్పర్దల వల్ల విడిపోయిన ఈ జంట రీసెంట్ గా మళ్లీ కలిసింది. ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్-కత్రిన పెళ్లి చేసుకుంటారంటూ పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ కు 52ఏళ్లు. కత్రినా కైఫ్ కు 34ఏళ్లు.