ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మొత్తానికి సెట్ మీదకు చేరుకుంది. చేరుకోవడమే కాదు, సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. ఈ దసరాకే విడుదల అని పోస్టర్ వదిలారు. నిజానికి దసరాకు వచ్చే పెద్ద సినిమాలు ఏవీ లేవు. మహష్ బాబు, బన్నీ కొత్త సినిమాలు స్టార్ట్ కావాలి. ప్రభాస్ సినిమా ఇప్పట్లో రాదు. రామ్ చరణ్-బోయపాటి సినిమాకు చాన్స్ వుంది. అందువల్ల దసరా బరి దాదాపు ఖాళీనే.
కానీ బాలయ్య బాబాయ్ నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ను దసరాకు తీసుకువస్తాం అని ప్రకటించారు. బాలయ్య ప్రకటించకపోయినా, ఆ సినిమా దర్శకుడు తేజ ప్రకటించారు. అందువల్ల సీరియస్ గా రెండు సినిమాలు మాట మీద వుంటే దసరాకు పోటీ పడతాయి.
కానీ అంత సీన్ వుండదు. ఎవరో ఒకరు అటో ఇటో అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే తేజ-బాలయ్య సినిమా ఇంకా స్టార్ట్ కావాలి. ముహుర్తం మాత్రం చేసుకుంది. ఇంకా స్టార్ కాస్ట్ సెలక్షన్, షెడ్యూలు ఇతరత్రా వ్యవహారాలు చాలా వున్నాయి. పైగా ఆ సినిమాకు సిజి వర్క్ లు చాలా వుంటాయి. ఎందుకంటే బాలయ్య 60కి పైగా గెటప్ ల్లో కనిపిస్తారు. ఇప్పటికే మూడు గెటప్ లు చూపించారు. దుర్యోధనుడిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా, కృష్ణుడిగా ఎలా వుంటారో ఈ మధ్యనే చూపించారు.
సో అందువల్ల అబ్బాయ్ డేట్ అనౌన్స్ చేసాడని బాబాయ్ తగ్గుతాడా? మరింత పంతంగా వస్తాడా? అన్నది చూడాలి.