చానెళ్లలో హల్ చల్ చేస్తున్న, శ్రీరెడ్డి ట్విట్టర్ వేదికగా లీక్ లు కమ్ ఆరోపణలు స్టార్ట్ చేసారు. నిర్మాత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు మీద ఆమె ఆరోపణలు చేసారు. వాకాడ అప్పారావు అమ్మాయిల పిచ్చికి ఎందరో బలయిపోయారని శ్రీరెడ్డి ఆరోపించారు.
ఇలాంటి వాళ్లలో 16ఏళ్ల పిల్లలు కూడా వున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం వాకాడ అప్పారావు మెగాస్టార్ చిరంజీవి క్యాంప్ లో వుంటున్నారు. ఆయన సినిమాల వ్యవహారాలు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయవద్దంటూ శ్రీరెడ్డి మెగాస్టార్ కు కూడా విజ్ఞప్తి చేసారు.
శ్రీరెడ్డి లీక్స్ అంటూ టాలీవుడ్ కు సంబంధించి కొన్ని విషయాలు సాక్ష్యాలతో బయట పెట్టిన శ్రీరెడ్డి, ఇప్పడు ఇండస్ట్రీలో వినిపించే గ్యాసిప్ లు ఆధారంగా చేసుకుని, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వాకాడ అప్పారావు గురించి ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్ లు ఎప్పటి నుంచో వినిపిస్తుంటాయి.
అవి నిజాలో, కిట్టని వాళ్లు చేసే ప్రచారాలో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరూ ఎప్పుడూ వాటిని సీరియస్ గా పట్టించుకోలేదు. ఆ మాటకు వస్తే ఇలాంటి అమ్మాయిల పిచ్చి వున్న వాళ్ల పేర్లు చాలా వినిపిస్తుంటాయి. అవన్నీ నిజాలు అని అనుకోవడానికి లేదు.
ఓ పే..ద్ద డైరక్టర్ తండ్రికి కూడా విపరీతంగా అమ్మాయల పిచ్చి వుందని ఇండస్ట్రీలో వినిపిస్తూ వుంటుంది. అలాగే ఒక హీరోకి ఒకప్పుడు ఇలాంటి పిచ్చి చాలా వుండేదని, ఇప్పుడు తగ్గిందని గ్యాసిప్ లు వున్నాయి.
ఇప్పుడు వున్న ఓ యంగ్ హీరోకు కూడా ఈ పిచ్చి వుందని అంటుంటారు. అందువల్ల ఇవన్నీ పట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదు. కానీ శ్రీరెడ్డి నేరుగా వాకాడ అప్పారావు పేరు, ఫొటో పెట్టి ట్వీట్ చేయడం విశేషం.