భరత్ అనే నేను సినిమా మీద టెన్షన్లు ముసురుకుంటున్నాయి. ఏ పెద్ద సినిమా అయినా ఇది తప్పదు. విడుదల దగ్గరకు వస్తున్న కొద్ది ప్రతి చిన్న విషయం టెన్షన్ పెంచేవే. సినిమా విడుదల ఎనిమిది రోజుల్లో వుంది.
సినిమాను ఈరోజు (గురువారం) సెన్సారుకు ఇస్తారని అనుకున్నారు. కానీ ఎందుకనో లాస్ట్ మినిట్ లో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బహుశా సోమవారం తరువాతే సెన్సారుకు ఇస్తారని తెలుస్తోంది.
లాస్ట్ మినిట్ టెన్షన్లు, చిన్న చిన్న పనుల్లో డైరక్టర్ కొరటాల శివ బిజీగా వున్నారు. ఇదే టైమ్ లో ఆయన కూడా శ్రీరెడ్డి చాటింగ్ లిస్ట్ లో వున్నారని బయటకు వచ్చింది.
నిజానికి ఈ మధ్య సెన్సారుకు ఫైనల్ కాపీ ఇవ్వడం లేదు. ఆర్ ఆర్ కాకుండానో, కరెక్షన్లు కాకుండానో చూపించేసి, సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారు. తరువాత తీరిగ్గా మిగిలిన పనులు చేసుకుంటున్నారు.
కానీ భరత్ అనే నేను ఏ దశలో సెన్సారుకు ఇస్తున్నారో తెలియదు. గురువారం ఇవ్వాల్సింది మాత్రం వాయిదా పడింది. ఇక్కడ మరో సమస్య ఏమిటంటే, సెన్సారు జరిగిన దగ్గర నుంచి సెన్సారు టాక్ అంటూ రకరకాలు బయటకు వస్తాయి. వాటిలో ఏది నిజమో తెలియదు. ఏది కాదో తెలియదు.
వీటిని సాకుగా చేసుకుని బయ్యర్లు డబ్బులు తక్కువ కట్టడం అన్నది కూడా కామన్. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ కు కూడా డబ్బులు తక్కువ కట్టారు కొందరు. అందుకే భరత్ అనే నేను అన్ని విధాలా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.