సాధారణంగా ఏదైనా సంచలన విషయం బయటకు వస్తే, చానెళ్లు అన్నీ ఇరుపక్షాల నుంచి విషయ సేకరణ కోసం ట్రయ్ చేస్తాయి. ఒకవేళ ఒకపక్షం అందుబాటులో లేకపోయినా, మాట్లడకపోయినా, కనీసం ప్రయత్నిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండో పక్షం మాట్లాడడానికి నిరాకరించినా, మైక్ పక్కకు తోసి వెళ్లిపోయినా, ఆ ఆఫీసు, ఆ ఇల్లు, ఆ కారు ఇలా అన్నీ రోజంతా చూపిస్తుంటాయి. అలాగే ఎవరిమీదైనా ఆరోపణ వస్తే, వాళ్లు స్టాక్ ఫొటోలు చూపిస్తుంటారు.
కానీ చిత్రంగా రామానాయడు స్టూడియో మీద, ఆ స్టూడియో అధినేత కొడుకు మీద ఫోటోలతో, చాటింగ్ స్క్రీన్ షాట్ లతో శ్రీరెడ్డి ఇన్ని ఆరోపణలు చేస్తుంటే, ఒక్కమైక్ స్టూడియో దగ్గరకో, అభిరామ్ ఇంటి దగ్గరకో వెళ్లిన దాఖలా లేదు. ఒక్క ఛానెల్ కెమేరా అటు తిరిగిన వైనం లేదు. వాళ్ల వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించలేదు. ఎందుకనో?
చంపేస్తే ఇలా ఇటే శ్మశానానికి వెళ్తుంది నా బాడీ అంటారో ఛానెల్ పెద్దాయిన. మా చానెల్ అన్నీ వెలికి తీస్తుంది అంటారు మరొకళ్లు. కానీ ఒక్కళ్లు కూడా సురేష్ బాబు, అభిరామ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసాం, ఫోన్ ఎత్తలేదు. స్టూడియో గేట్ తీయలేదు అని చెప్పారా? అదే ఎక్కడో వున్న శ్రీరెడ్డి అమ్మ అభిప్రాయం మాత్రం తేగలిగారు. ఇదీ మన మీడియా తీరు.