ప్రతి సినిమా విడుదల తరువాత విదేశాలకు విశ్రాంతి కోసం వెళ్లడం అన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు అలవాటు. కానీ ఫర్ ఏ ఛేంజ్, ఇప్పుడు సినిమా విడుదలకు ముందే వెళ్లిపోయారు.
భరత్ అనే నేను సినిమా విడుదల మరో ఎనిమిది రోజుల్లో వుంది. మహేష్ బాబు ఫ్యామిలీతో విహారయాత్రలో వున్నారు. ఆయన 16న తిరిగి వస్తారు. విడుదలకు ముందు మూడు రోజుల పాటు భరత్ ఫ్రచారంలో మహేష్ పాల్గొంటారు.
అయితే మహేష్ బాబు సినిమా విడుదలకు ముందు విహారానికి వెళ్లడానికి వేరే రీజన్ వుందట. భరత్ అనే నేను సినిమాకు ప్రీ పబ్లిసిటీ కన్నా పోస్ట్ పబ్లిసిటీ ఎక్కువ చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి రెండు వారాలు ప్రచారం చేయడానికి తాను రెడీ అని మహేష్ పబ్లిసిటీ టీమ్ కు చెప్పినట్లు తెలుస్తోంది.
విడుదలకు ముందు జస్ట్ మూడు రోజులు కీలకమైన ఇంటర్వూలు అలాంటివి ఫినిష్ చేసి, మీడియా పేరంటాలు లాంటి వ్యవహారాలు అన్నీ విడుదల తరువాత పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి పెద్ద హీరోలంతా ఇదే పద్దతి పాటిస్తున్నారు ఇటీవల. విడుదలకు ముందు కొన్ని ఇంటర్వూలు లేదా ప్రచారాలు చేసి, విడుదలై, హిట్ అనిపించుకుంటే, అప్పుడు మీడియా ముందుకు తలెత్తుకుని వస్తున్నారు. లేదూ అంటే ‘అజ్ఞాతవాసి’ అయిపోతున్నారు..