కృష్ణార్జున యుద్ధం సినిమా విడుదలైంది. ఫస్ట్ హాఫ్ బాగుందని సెకెండాఫ్ మరి కొంచెం బాగుంటే బాగుండేదని టాక్ వచ్చింది. దీంతో సినిమా యూనిట్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
సినిమాలో చివర్న వచ్చే సాంగ్ ను ఫస్ట్ షోల నుంచి తీసేసారని తెలుస్తోంది. రుక్సర్ థిల్లాన్-నానిలపై క్లయిమాక్స్ ముందు వచ్చే సాంగ్ సినిమా రన్ కు బ్రేక్ వేస్తోందని సూచనలు వినిపించాయి. దాంతో ఆ పాటను తీసేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
సినిమా తొలిసగం లెంగ్తీగా వున్నా కూడా పెద్దగా రిమార్కులు రాలేదు. ద్వితీయార్థం నిడివి తక్కువగా వున్నా కూడా విమర్శలు వినిపించడంతో, ఈ పాటను తీసేసారు. దీంతో ద్వితీయార్థం మరింత చకచకా నడిచిన ఫీలింగ్ వస్తుంది. దర్వకుడు, హీరో, సినిమా హోల్ సేల్ బయ్యర్ దిల్ రాజు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ షో నుంచి పాటను కట్ చేసే ప్రయత్నం చేసారు ముందుగా వీలయినన్ని థియేటర్లలో పాట లేకుండా ప్రదర్శిస్తారు. రేపు ఉదయం ఆట నుంచి అన్ని థియేటర్లలోనూ ఈ కొత్త వెర్షన్ నే అందుబాటులో వుంటుంది. మేర్లపాక గాంధీ డైరక్షన్ వహించిన ఈ సినిమాలో నాని డబుల్ రోల్ లో నటించాడు.