టాలీవుడ్ జనాలకు శ్రీరెడ్డి ఫోబియో

దాగుడు మూతా దండా కోర్, పిల్లి వచ్చే.. ఎలకలన్నీ గప్ చుప్.. అంటూ పిల్లలు ఆటలాడుతుంటారు. టాలీవుడ్ పెద్దలంతా ఇప్పుడు ఇలాగే కిందా మీదా అవుతున్నారు.  ఎందుకుంటే ఇక్కడ నూటికి యాభై మంది అమ్మాయి…

దాగుడు మూతా దండా కోర్, పిల్లి వచ్చే.. ఎలకలన్నీ గప్ చుప్.. అంటూ పిల్లలు ఆటలాడుతుంటారు. టాలీవుడ్ పెద్దలంతా ఇప్పుడు ఇలాగే కిందా మీదా అవుతున్నారు.  ఎందుకుంటే ఇక్కడ నూటికి యాభై మంది అమ్మాయి దొరికితే వాడేసేవారే. వయసుతో సంబంధం లేదు. అయ్యో పాపం అనీ లేదు. దొరికిందా.. వాడేసామా? లేదా? అన్నదే.

ఇండస్ట్రీలో కాస్త పేరున్న 'పెద్దాయన' ఒకరు అయితే, పగటి వేళ కూడా ‘అదే పనిపై’ వుంటారని టాక్. ఆ పెద్దాయన ఓసారి కోరి ఫోన్ నెంబర్ సంపాదించి ఓ రచయిత్రికి ఫోన్ చేసి, కథ బాగుంది, డిస్కషన్ కు రమ్మని పిలిచాడట. వెళ్లాలా? వద్దా? అని ఆమె కొందరికి ఫోన్ చేస్తే, ఫోన్ నెంబర్ చూసి కాదు, ఫొటో చూసి పిలిచి వుంటాడు. వెళ్లవద్దని సలహాలు వచ్చాయట. దాంతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందట. అంత పేరు పడ్డాడు ఆయన.

ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో కొ కొల్లలు. ఓ చనిపోయిన టాప్ ప్రొడ్యూసర్ అయితే, ‘నా నుంచి కారు గిఫ్ట్ అందుకోని హీరోయిన్ లేదు, మన రూమ్ కు రాని హీరోయిన్ లేదు’ అని గర్వంగా చెప్పుకునేవాడట. ఇండస్ట్రీలో కేవలం ఇలా బలైపోయే అమ్మాయిలే కాదు. బలిచేసే అమ్మాయిలు కూడా వుంటారు. ముందు వీళ్లు రంగంలోకి దిగుతారు. తరువాత తరువాత తమ అవసరాల కోసం వేరే వాళ్లను రంగంలోకి దింపుతుంటారు.

ఓ దర్శకుడు అయితే తన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోనే మరో అపార్ట్ మెంట్ తీసుకుని, అందులో తనకు నచ్చిన కొందరిని వుంచారని టాక్ వుంది. హీరోలు కూడా తక్కువేమీ కాదు. మొన్నటికి మొన్న రాధిక ఆంప్టే మన హీరోల సంగతి ఓపెన్ గా చెప్పింది. అలాగే ప్రస్తుతం మాంచి జోష్ మీదున్న యంగ్ హీరో ఒకరికి అమ్మాయిల పిచ్చి ఎక్కువే అని టాక్ వుంది.

ఇప్పుడు ఇలాంటి వారందరికీ ‘శ్రీరెడ్డి ఫోబియో’ పట్టుకుంది. ఎందుకంటే సురేష్ బాబు లాంటి అన్ని విధాలా బడాబాబు కొడుకు వ్యవహారమే బయటకు వచ్చేసింది. ఇక మిగిలిన వారు ఎంత? పైగా టాలీవుడ్ లో చోటా, మోటా నుంచి బడా వరకు కొందరికి విదేశాలకు వెళ్లడం, అక్కడ వుండే స్పెషల్ వాట్స్ అప్ గ్రూప్ లను కాంట్రాక్టు చేసి, కొన్నాళ్లు వుండి, కాస్త డబ్బు చేసుకురావడం అలవాటు అన్న గుసగుసలు వున్నాయి.. ఇక ఇక్కడ అయితే కింది స్థాయి నుంచి మీద స్థాయి వరకు అమ్మాయిలను వాడేసేవారి సంఖ్య తక్కువకాదు.

ఇప్పుడు వీరందరికీ భయం పట్టుకుంది. తమ తమ చాటింగ్ లు, వాట్సప్ స్క్రీన్ షాట్ లు, కాల్ రికార్డులు, ఇలాంటివి అన్నీ ఎవరిదగ్గర వుండి వుంటాయో అని? ఎవరు బయట పెడతారో? అని. శ్రీరెడ్డి టైపులో ఎవరైనా తయారైతే కష్టం అని. అసలే డిజిటల్ వరల్డ్. ఇప్పుడు ప్రతిదానికి సాక్ష్యం రెడీ. ఎవరు లీక్ చేస్తారో? ఏమిటో అని? భయమే భయం.

అందుకే కొన్నాళ్లు టాలీవుడ్ లో ఈ ‘వాడకాలు’ తగ్గుతాయోమో? తాత్కాలికంగానైనా? లేదా ఫోన్ లు పక్కన పెట్టి, స్విచాఫ్ లు చేసారని పక్కా రూఢి చేసుకున్నాక కానీ, డీలింగ్ లు ప్రారంభించరేమో?