జనాల కళ్లకు మీడియా గంతలుదాదాపు రెండు నెలలుగా కసరత్తులు చేసి, అధ్భుతమైన ఫిజిక్ సాధించాడు ఎన్టీఆర్. ఇటు త్రివిక్రమ్ సినిమా కోసం, అటు రాజమౌళి సినిమాలో బాక్సర్ క్యారెక్టర్ కోసం సన్నాహాలు ఇవన్నీ.
ఈ సన్నాహాలు చూసి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మురిసిపోయినట్లున్నాడు. అందుకే తన సినిమా ఓపెనింగ్ షాట్ నే నేరుగా ఫైట్ తో స్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది.
మరో రెండు రోజుల్లో అంటే 13న ఎన్టీఆర్-త్రివిక్రమ్-హారిక హాసిని సినిమా షూట్ ప్రారంభమవుతోంది. ఈ షూట్ లో మొదటగా ఫైటింగ్ సీన్ తీస్తారట. అది కూడా ఓపెన్ బటన్ షర్ట్ లేదా షర్ట్ లేకుండా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ రివీల్ అయ్యేలా ఫైట్ వుంటుందని తెలుస్తోంది.
గతంలో ఓసారి ఎన్టీఆర్ సిక్స్ ఫ్యాక్ బాడీ చూపించాడు. ఇప్పుడు విదేశీ ట్రయినర్ ను పెట్టుకుని మరీ సాధించిన మాంచి ఫిట్ ఫిజిక్ ను చూపిస్తాడన్నమాట.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాను కంటిన్యూగా షూట్ చేసి దసరా బరిలోకి దింపాలన్నది ప్లాన్. కానీ అది సాధ్యమవుతుందా అన్నది అనుమానం. ఎందుకంటే ఎంత వేగంగా ఫినిష్ చేసినా అక్టోబర్ లోపు అసాధ్యం. మరి టైమ్ సరిపోవడం అన్నది ఒక సమస్య.
దసరా టైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్ వుంటే అదో సమస్య. వీటన్నిటికి మంచి ఇవ్వాళ, రేపు పెద్ద సినిమా అంటే 100కోట్ల సినిమా. అలాంటి సినిమాలకు సంక్రాంతి, సమ్మర్ సీజన్ ల మాదిరిగా దసరా సీజన్ సరిపోదు. అందువల్ల ఈ సినిమా సంక్రాంతికి రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు వున్నాయి.