శ్రీరెడ్డి లీకుల మాటేమో కానీ, ఇండస్ట్రీలో బోలెడు గుసగుసలు. అందులో కీలకంగా ఇన్నాళ్లు వినిపించిన సురేష్ బాబు కొడుకు అభిరామ్ సంగతి నిజమే అని తేలింది. అలా వినిపించిన, వినిపిస్తున్న గుసగుసల్లో మరోటి ఓ పెద్ద డైరక్టర్ తో శ్రీరెడ్డి సన్నిహితంగా వున్న ఫొటో వుందని.
అపజయం అన్నది తెలియని ఆ డైరక్టర్ తో శ్రీరెడ్డి ఫొటో అంటే సినిమా జనం నమ్మడంలేదు. ఎందుకంటే కాస్త ఐడియాలజీ, మంచి విషయాలు సినిమాల్లో చెప్పడం వంటి లక్షణాలున్న వ్యక్తి. అందువల్ల అన్నీ వదంతులే అని కొట్టి పారేస్తున్నారు.
మరోపక్క ఓ కమెడియన్ వీడియో కాల్స్ చేసి, ఆ సమయంలో చిత్ర విచిత్ర ప్రదర్శలు చేసిన సాక్ష్యాలు కూడా శ్రీరెడ్డి దగ్గర వున్నాయని వినిపిస్తోంది. ఇదిలా వుంటే ఇప్పటికే కొందరు శ్రీరెడ్డితో తమ తమ రూట్లలో కొంత రాజీ వ్యవహారాలు నడిపించారని, దానికి ఆమె కూడా సానుకూలంగానే స్పందించారని వార్తలు వినిపిస్తున్నాయి.
సురేష్ బాబు కొడుకు అభిరామ్ వ్యవహారం కూడా ముందుగా ఓ దర్వకుడి ద్వారా డీల్ చేసి, సెటిల్ చేసారని, కానీ అంతలోనే మళ్లీ మా సంఘ పెద్దల నిర్వాకం వల్ల బయటకు వచ్చేసిందని టాక్ వినిపిస్తోంది.