‘’…గడచిన రెండు కమిటీలుగా మా అసోసియేషన్ లో వచ్చిన మార్పు ఏమిటంటే, ఊ అంటే ప్రెస్ మీట్.. స్నాక్స్. వేలు ఖర్చు. ఆ.. అంటే ప్రెస్ మీట్.. స్నాక్స్.. వేల ఖర్చు రాసేయడం…’’
ఇది ఈ అయిటమ్ కు లీడ్ కాదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుస. మా సంఘ పెద్లలకు పబ్లిసిటీ, టీవీల్లో కనిపించాలని ఎక్కువ కోరిక వున్నట్లుందని, గతంలో జస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చి ఊరుకునేవారని, ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా ప్రెస్ మీట్ లు పెట్టేసి, ఖర్చులు రాసేస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి.
దీనికి తోడు శ్రీరెడ్డి ఉదంతం కాస్త సద్దుమణిగిద్దాం అని తెరవెనక ప్రయత్నాలు చేస్తున్న టైమ్ లో మా సంఘ పెద్దలు అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఆమెను ఎంత రెచ్చగొట్టాలో అంతా రెచ్చగొట్టారు. కార్డు ఇవ్వంకాక ఇవ్వమని చెప్పడం వేరు. అసలు సినిమాల్లో వేషాలు వేయనివ్వము. ఆమెతో ఎవరైనా నటిస్తే వెలెస్తాం అంటూ ఫత్వా జారీ చేసారు.
ఇది రెండు విధాలుగా రివర్స్ అయింది. ఒకటి ప్రతి ఒక్కరు మా నిర్ణయాన్ని తిట్టి పోస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని నిలదీస్తున్నారు. మరోపక్క అసలు ఇంతవరకు వచ్చాక ఇక దాచడం ఎందుకు అని శ్రీరెడ్డి లీక్స్ అంటూ సురేష్ బాబు కొడుకు అభిరామ్ వ్యవహారం బయటపెట్టింది. దీనంతటికీ మూలం మా సంఘ పెద్దలు, శివాజీరాజా లాంటి వాళ్లు రెచ్చగొట్టడమే కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి దర్శకుడు తేజ ఆమెను పిలిపించి, రెండు అవకాశాలు ఇచ్చి, వీడియో బైట్ కూడా వదిలారు. అదే తేజ మా అధ్యక్షుడు శివాజీ రాజాకు ఫోన్ చేసి, సభ్యత్వం ఇవ్వండి. మెంబర్ షిప్ ఫీజ్ కావాలంటే ఏదైనా చేద్దాం. వీలైతే రద్దు చేయండి. తప్పేంలేదు అని చెప్పినట్లు తెలుస్తోంది. అప్పుడు ఊ అన్న శివాజీ రాజా, తరువాత మళ్లీ రెచ్చిపోయి, శ్రీరెడ్డిని రెచ్చగొట్టారు. ఇప్పుడు మరింత ముదిరింది. దాంతో సినిమా పెద్దలు చాలామంది శివాజీరాజాదే తప్పు అన్నట్లు, అంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.