బన్నీ-పాజిటివ్ స్ట్రాటజీలు

స్టార్ హీరో రేంజ్ నుంచి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ, వైవిధ్యమైన సినిమాల కోసం ప్రయత్నిస్తున్న అల్లుఅర్జున్ మెల్లగా తన స్ట్రాటజీలు కూడా మారుస్తున్నారు. చెప్పను బ్రదర్ అనే వివాదం తరువాత బన్నీ కాస్త…

స్టార్ హీరో రేంజ్ నుంచి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ, వైవిధ్యమైన సినిమాల కోసం ప్రయత్నిస్తున్న అల్లుఅర్జున్ మెల్లగా తన స్ట్రాటజీలు కూడా మారుస్తున్నారు. చెప్పను బ్రదర్ అనే వివాదం తరువాత బన్నీ కాస్త మారినట్లు కనిపిస్తోంది. మెగా యంగ్ హీరోల్లో ఇప్పడు ఇద్దరే టాప్ ప్లేస్ ల్లో వున్నారు. చరణ్-బన్నీ. అందుకే బన్నీ వీలయినంత వరకు చరణ్ తో సఖ్యత మెయింటెయిన్ చేయాలని చూస్తున్నాన్నారు.

రంగస్థలం విడుదలకు ముందు బన్నీ తన ప్రచారం ఆపడం, అలాగే తన కొడుకు ఫోటోలు, వీడియోలు వదలడం అన్నీ పాజిటివ్ ట్రెండ్ కోసం చేసిన ప్రయత్నాలే. అదే సమయంలో మీడియాతో కూడా పాజిటివ్ లైన్ లో వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఓసారి మీడియాతో చిన్న డిస్ట్రబెన్స్ వచ్చిన దగ్గర నుంచి చాలా కేర్ ఫుల్ గా వుంటున్నారు. లేటెస్ట్ గా తన బర్త్ డే సందర్భంగా మీడియాకు మాంచి పార్టీ ఇవ్వడమే కాదు, తాను కూడా చాలా సేపు వుండి, కేక్ కట్ చేసి వెళ్లారు.

బౌన్సర్లను కాస్త దూరంపెట్టి, పేరు పేరునా అందరినీ పలకరించారు. మొత్తానికి బన్నీ ఇఫ్పుడు కాస్త లైన్లోకి వచ్చి, కేవలం తన సినిమాలే మాట్లాడతాయి, తను మరింకేమీ పట్టించుకోనక్కర లేదు అనే స్టేజ్ నుంచి అందరివాడు అనే ఇమేజ్ కోసం ట్రయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.