నానిని బాలయ్య వద్దన్నారా?

ఇండస్ట్రీలో కొన్ని విషయాలు ఆ నోటా ఈ నోటాపడి భలే వినిపిస్తుంటాయి. అలాంటిదే ఇదీనూ. ఎన్టీఆర్ బయోపిక్ కాస్టింగ్ సెలక్షన్ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయంలో సినిమాకు మరికాస్త క్రేజ్ పెంచేందుకు దర్శకుడు…

ఇండస్ట్రీలో కొన్ని విషయాలు ఆ నోటా ఈ నోటాపడి భలే వినిపిస్తుంటాయి. అలాంటిదే ఇదీనూ. ఎన్టీఆర్ బయోపిక్ కాస్టింగ్ సెలక్షన్ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయంలో సినిమాకు మరికాస్త క్రేజ్ పెంచేందుకు దర్శకుడు తేజ కొన్ని సూచనలు చేసారని తెలుస్తోంది. కొంతమంది యంగ్ సినిమా హీరోలను, కొంతమంది నటులను కలిపి ఓ జాబితా తయారుచేసి బాలయ్యకు చూపించినట్లు తెలుస్తోంది. వీళ్లలో కొందరిని ఓకె చేస్తే, వాళ్లకు సూటయ్యే పాత్రలను ఎంపికచేసి, బయోపిక్ లోకి తీసుకుందామన్నది దర్శకుడు తేజ ఆలోచగా తెలుస్తోంది.

ఆ జాబితాలో యంగ్ హీరోలు నాని, శర్వానంద్ పేర్లు కూడా వున్నాయని వినికిడి. అయితే శర్వా పేరు విషయం ఏంచేసారో తెలియలేదు కానీ, నాని పేరు విషయంలో బాలయ్య వీటో చేసినట్లు గుసగుసలు వినిపిస్తన్నాయి. నిజానికి నానికి బాలయ్య అంటే పిచ్చి అభిమానం. నాని గతంలో ఓ సినిమాలో బాలయ్య పేరును చేతిమీద టట్టూ వేయించుకుని, అభిమానిగా నటించాడు కూడా.

అలాగే ఓ సినిమాలో సందర్భోచితంగా సినిమా పాటలు ప్లే చేయాల్సి వస్తే, పవన్ కళ్యాణ్ పాటలు పెడితే, వద్దు, బాలయ్య పాటలు పెట్టండి అని కోరాడని కూడా గుసగుసలు వున్నాయి. అంతటి ఫీలింగ్, అభిమానం నానికి వున్నాయి. కానీ మరి ఎందుకనో నాని పేరును లిస్ట్ లోంచి బాలయ్య స్ట్రయికాఫ్ చేసినట్లు వినిపిస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యామిలీ

ఇదిలా వుంటే ఎన్టీఆర్ ఫ్యామిలీలో కొందరు ఈ సినిమాలో సందర్భోచితంగా కనిపించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. హీరో నారారోహిత్ ఇప్పటికి పక్కాగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే క్యారెక్టర్ ఏమిటన్నది తెలియదు. తారకరత్నకు కూడా అవకాశం వుంటుందని వినికిడి. వీరుకాక, ఇప్పటి దాకా సినిమాల్లో కనిపించని ఒకరిద్దరు కూడా కనిపించే అవకాశం వుందంటున్నారు. కానీ కళ్యాణ్ రామ్ సంగతి మాత్రం ఇంకా వినిపించడం లేదు. ఎన్టీఆర్ మాత్రం సమస్యేలేదు. ఆ పేరు చెబితే బాలయ్య సర్రున లేస్తారని ఇండస్ట్రీలో టాక్ వుంది.