నేల టిక్కెట్టు లో రవితేజ ఏం చేస్తుంటాడు..?

రవితేజ, మాళవిక శర్మ హీరోహీరోయిన్లుగా నేల టిక్కెట్టు అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మాస్ సబ్జెక్ట్ తో వస్తోందనే విషయం తెలుసు కానీ, సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని మాత్రం…

రవితేజ, మాళవిక శర్మ హీరోహీరోయిన్లుగా నేల టిక్కెట్టు అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మాస్ సబ్జెక్ట్ తో వస్తోందనే విషయం తెలుసు కానీ, సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. ఎట్టకేలకు నేల టిక్కెట్టులో రవితేజ క్యారెక్టర్ ఏంటో తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నకిలీ డాక్టర్ గా కనిపించబోతున్నాడట రవితేజ. అంటే.. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి చేసినలాంటి పాత్ర అన్నమాట. అయితే నకిలీ డాక్టర్ అనేది పేరుకు మాత్రమే. మనిషి మాత్రం మంచోడన్నమాట. ఓ ఊరిలో నకిలీ డాక్టర్ గా ఉన్న రవితేజ చుట్టూ అల్లుకున్న సినిమా ఇది. సినిమా సెటప్ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. మాస్, క్లాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట.

కల్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చేనెల 24న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు, తాజాగా మరో స్టిల్ కూడా విడుదల చేశారు. ఫిదా ఫేం శక్తికాంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.