కమర్షియల్ ఫార్ములాకి హాస్యాన్ని జోడించి అద్భుతమైన విజయాలు అందుకున్న దర్శకులు త్రివిక్రమ్, శ్రీను వైట్ల. వీరిలో త్రివిక్రమ్‌ది ఒక తరహా శైలి అయితే శ్రీను వైట్లతో మరో ఫార్ములా. అయితే తన ఫార్ములాకి తానే బందీ అయిపోయి దాని నుంచి బయటకి రాలేక ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ చిత్రాలతో శ్రీను వైట్ల తన స్టార్డమ్ మొత్తం కోల్పోయాడు.
వరుసపెట్టి భారీ విజయాలెన్నో అందించిన త్రివిక్రమ్ టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుని చేసిన అజ్ఞాతవాసి తన ఇమేజ్‌ని దారుణంగా దెబ్బ తీసింది. ఒక్కసారిగా త్రివిక్రమ్ కెపాసిటీపై డౌట్లు ఏర్పడే స్థాయిలో డిజప్పాయింట్ చేసాడు. ఇటీవల తారక్‌తో తీసిన ఐపీఎల్ తెలుగు యాడ్‌లో కూడా అజ్ఞాతవాసి ఛాయలు కనిపించాయి. క్రియేటివిటీ లేకుండా కేవలం మాటలతో గారడీ చేయాలనే ప్రయత్నం గట్టిగా కనిపించింది.
వరుసగా వచ్చిన విజయాలతో ఒక తరహా మూసకి అలవాటు పడిపోయిన త్రివిక్రమ్ ఇప్పుడు కంఫర్ట్ జోన్‌నుంచి బయటకి రాలేకపోతున్నాడనిపిస్తోంది. ఇమ్మీడియట్‌గా మేల్కొనకపోతే అతనికి త్రివిక్రమ్ కూడా వైట్ల మాదిరిగా ఇంకా ఇంకా స్లిప్ అయ్యే అవకాశాలున్నాయి. తారక్ చిత్రంతో కేవలం తన మార్కు ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏదైనా కొత్తదనం అందించే ప్రయత్నం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి డిఫెన్స్‌లో పడ్డ త్రివిక్రమ్ ఆలోచనలు ఎలా వున్నాయో?