‘ఆచారి’ కి దిల్ రాజు సపోర్ట్

ఆచారి అమెరికా యాత్రకు మంచి సపోర్ట్ నే దొరికింది. నాగేశ్వర రెడ్డి, విష్ణు కాంబినేషన్ లో తయారైన సినిమా ఇది. ఈ కాంబినేషన్ కు కాస్త పేరుంది. ఈ సినిమాను జనవరిలో విడుదల చేసేయాలని…

ఆచారి అమెరికా యాత్రకు మంచి సపోర్ట్ నే దొరికింది. నాగేశ్వర రెడ్డి, విష్ణు కాంబినేషన్ లో తయారైన సినిమా ఇది. ఈ కాంబినేషన్ కు కాస్త పేరుంది. ఈ సినిమాను జనవరిలో విడుదల చేసేయాలని కాస్త గాభరా పడ్డారు. కొంచెం త్వరత్వరగా పని కానిచ్చారు. కానీ సినిమాల తొక్కడి, నిర్మాతకు వున్న సమస్యల కారణంగా విడుదల కాలేకపోయింది.

బాగానే వచ్చిన సినిమా అని ఇన్ సైడ్ టాక్ వున్న ఈ సినిమాను ఈనెల 6న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వ్యూహం మారినట్లు తెలుస్తోంది. ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సీన్లోకి ఎంటరై, నితిన్ ఛల్ మోహన్ రంగా సోలోగా విడుదలయ్యేందుకు మార్గం సుగమం చేసారు.

ఆచారి సినిమాను మాంచి డేట్ చూసి మరోసారి వేసుకోమని, తను మద్దతుగా వుండి, అన్ని విధాలా సహాయం చేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆచారి అమెరికాయాత్ర నిర్మాత ఓకె అన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఈ సాయంత్రమో, రేపు ఉదయమో ప్రెస్ నోట్ రావచ్చు. ప్రస్తుతం దిల్ రాజు చెన్నయ్ వెళ్లినందున, వచ్చిన తరువాత ఈ మేరకు ప్రకటన వుండొచ్చు.