‘పెద్ద డైరెక్టర్ అని పొగరు.. అబద్ధాలు చెప్పడంలో దిట్ట.. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికి రారు అని అతడి ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా.. బక్క పీచు సోగ్గాడు.. వూదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే.. టెక్నికల్ గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని.
మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు.. వీడియో కాల్ కోసం ఏమైనా కోసుకుంటాడు పాపం.. మేల్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాకు.. వారెవరో కాదు.. కొమ్ములు వచ్చిన శేఖరుడు..’ అని అంటూ.. పెద్ద పోస్టే పెట్టింది సంచలన నటి శ్రీ రెడ్డి. ఆమె వర్ణన అంతా వింటే, ఆ దర్శకుడు ఎవరో అర్థం చేసుకోవడం ఏ మాత్రం కష్టం కాదు.
అతడి ఇంటి పేరును, ఒంటి పేరును చివరి పదంగా కొసరు మెరుపుగా ఇచ్చింది ఈమె. ఈ పోస్టు సంచలనం అని వేరే చెప్పనక్కర్లేదు. ఒక ప్రముఖ దర్శకుడిని, అది కూడా ఈ మధ్యనే ఫామ్ లోకి వచ్చిన దర్శకుడిని, ఇది వరకూ తన సినిమాలతో ఇండస్ట్రీని, ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడి పేరును ఆమె ఇప్పుడు ఇన్ డైరెక్టుగా పేర్కొంది.
కోలీవుడ్ లో దుమ్మురేపిన సుచీలీక్స్ కు ధీటుగా ఈ శ్రీ లీక్స్ సంచలనంగా మారుతున్నాయి ఇప్పుడిప్పుడు. ఇండస్ట్రీలో పరిస్థితులపై ఇప్పటి వరకూ విమర్శలు, ఊహాగానాలు.. తప్పేంటి? అనే మాటలే వినిపించగా, ఇప్పుడు ఈమె డైరెక్టుగా కొంతమంది పేర్లను చెబుతూ, వారికి ఎలాంటెలాంటి లైంగిక వీక్ నెస్ లున్నాయో కూడా చెబుతోంది. మరి ఈ రచ్చంతా ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి!