ఈ మధ్య తెలుగు నిర్మాతలకు దొరికిన అదనపు ఆదాయం అమెజాన్ ఫ్రయిమ్. నిర్మాతలకు మంచి అమౌంట్ ను ఆఫర్ చేస్తూ సినిమాలను చకచకా కొనేస్తోంది. అదే సమయంలో సినిమాను తన ప్రయిమ్ సభ్యులకు అందించడంలో కూడా చాలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. సినిమా హిట్ అయి, మార్కెట్ లో ఇంకా షేర్ తెచ్చుకుంటున్నా కూడా తన టైమ్ బాండ్ ప్రకారం తను ప్రయిమ్ లో అప్ లోడ్ చేసేస్తోంది.
నేను లోకల్, రాజా ది గ్రేట్, అలాగే వచ్చేసాయి. పద్మావతి సినిమా జనవరి 25న విడుదలయింది. నాలుగు రోజుల కిందటే అంటే రెండునెలలకే అమెజాన్ లోకి వచ్చేసింది. దీని వల్ల నిర్మాతలకు ఓకె. కానీ కొనుక్కున్న బయ్యర్లకు లాంగ్ రన్ కాస్త తగ్గుతోంది.
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం కూడా అమెజాన్ ప్రయిమ్ లోకి వస్తుంది. సినిమా చూసిన వారందరికీ అందులో టైటిల్స్ లో అమెజాన్ కార్డ్ పడినపుడే ఆ సంగతి తెలుసు. అయితే ఎప్పుడు అమెజాన్ లోకి వస్తుంది. 30రోజుల్లోనేనా? అంటే కాదని తెలుస్తోంది. 45రోజుల తరువాత అమెజాన్ లో పెట్టుకునేలా మైత్రీమూవీ మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అంటే మే 15నాటికి రంగస్థలం అమెజాన్ లో ఫ్రత్యక్షమవుతుందన్నమాట.
అప్పటికి సమ్మర్ సీజన్ చాలా వరకు అయిపోతుంది, పైగా భరత్ అనే నేను, నా పేరు సూర్య లాంటి రెండు పెద్ద సినిమాలు రంగంలోకి వస్తాయి కాబట్టి ఇంక రంగస్థలం షేర్ పెద్దగా వుండదు, సో ఫర్వాలేదు.