ఏమంత తొందర తేజా?

ఇదిగో క్లాప్ అంటే అదిగో విడుదల అన్నట్లు వుంది. ఎన్టీఆర్ బయోపిక్ కు జస్ట్ క్లాప్ పడింది. మరో రోజు అంటే రేపు షూట్ వుంది. ఆ తరువాత ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది బాలయ్యకు…

ఇదిగో క్లాప్ అంటే అదిగో విడుదల అన్నట్లు వుంది. ఎన్టీఆర్ బయోపిక్ కు జస్ట్ క్లాప్ పడింది. మరో రోజు అంటే రేపు షూట్ వుంది. ఆ తరువాత ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది బాలయ్యకు తప్ప మరెవరికీ తెలియదు. ఇంకా నటీనటులు చాలా మందిని తీసుకోవాలి.

అన్నింటికి మించి తేజ ప్రస్తుతం చేస్తున్న వెంకీ సినిమా స్టార్ట్ చేయాలి. పూర్తి చేయాలి. దానికి ఇంకా క్లాప్ పడలేదు. ఎంత ఫాస్ట్ గా చుట్టేసినా మూడు నెలలు అయితే పడుతుంది. అంటే జూన్ ఎండింగ్.

మరి మధ్య మద్యలో ఇటు వచ్చినా, ఆపై దసరాకు ఈ బయోపిక్ విడుదల చేసేయాలంటే, దాన్ని కూడా మూడు నెలల్లో చుట్టేయాలి. ఎన్టీఆర్ బయోపిక్ అంత సులువుగా చుట్టేసే వ్యవహారం కాదు. పోనీ కేవలం ఎన్టీఆర్ గెటప్ లు యాభై అరవై, ఒక్కోటి రెండు నిమషాలు చేస్తే రెండు గంటల సినిమా అదే అవుతుంది అనుకున్నా, రోజుకో గెటప్ వంతున రెండునెలలు వాటికే కావాలి. మరి మిగిలిన సినిమా?

అసలు దసరా బరి అన్నది ఎందుకు ఆలోచనలోకి వచ్చినట్లో? బాలయ్యకు అచ్చి వచ్చిన సంక్రాంతి వుండగా. ఇలా ముందుకు వచ్చే ఆలోచన ఎందుకు చేసినట్లు? వైఎస్ఆర్ బయోపిక్ సంక్రాంతికి వస్తుందని టాక్ వినవస్తోంది.

మరోపక్క ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అయితే దసరాకు లేదా సంక్రాంతికి అంటున్నారు. అదీ కాక ఎన్నికలు 2019ఆరంభంలో వచ్చే అవకాశం వుందంటున్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాలయ్య దసరా బరిలోకి రావాలని చూస్తున్నారేమో?

ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి