సి కళ్యాణ్ తాపత్రయమే కానీ..

బాలయ్యతో సినిమా చేసి లాభం కళ్ల చూసిన నిర్మాత ఇటీవల కాలంలో ఎవరు అంటే సి కళ్యాణ్. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. వివి వినాయక్ సినిమావచ్చి, ఉన్నదీ, వచ్చినదీ అంతా…

బాలయ్యతో సినిమా చేసి లాభం కళ్ల చూసిన నిర్మాత ఇటీవల కాలంలో ఎవరు అంటే సి కళ్యాణ్. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. వివి వినాయక్ సినిమావచ్చి, ఉన్నదీ, వచ్చినదీ అంతా ఊర్చుకుపోయింది.

మాంచి విలువైన స్థలం అమ్మేసుకోవాల్సి వచ్చింది వివి వినాయక్ పుణ్యమా అని. అందుకే మళ్లీ అర్జెంట్ గా మరో సినిమా తీయాలి. వివి వినాయక్ తన పాప ప్రక్షాళన కోసం మరో సినిమా మరీ ఫ్రీగా కాకపోయినా, నామినల్ రేటుకు చేస్తారు. హిట్ ఇచ్చాడన్న అభిమానంతో బాలయ్య డేట్ లు ఇస్తాడు.

అయితే అంతవరకు ఓకె. కానీ ఇప్పట్లో బాలయ్యతో సి కళ్యాణ్ సినిమా ఏదీ లేదన్నది వాస్తవం. సి కళ్యాణ్ అయితే సినిమా వుందని, తాను సినిమా చేస్తానని బహిరంగంగానే చెప్పడం వాస్తవం.

కానీ వివి వినాయక్ కావచ్చు, సంపత్ నంది కావచ్చు, ఎవ్వరూ ఏ ఒక్క లైన్ కూడా బాలయ్యకు చెప్పలేదు. ఎందుకంటే ఆయన దాదాపు గత నెల రోజుల నుంచి ఏదో ఒక పని మీద బిజీగా వుంటూ వస్తున్నారు. అస్సలు ఖాళీ లేదు. అందువల్ల అస్సలు సినిమా జనాలతో సిటింగ్ వేసే పరిస్థితిలేదు.

కీలకమైన ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారమే అలా పెండింగ్ లో వుంది. అది స్టార్ట్ చేయాలి, అంతవరకు బాలయ్య కథ వినే మూడ్ లో లేరన్నది ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.