టాక్సీవాలా వచ్చేసాడు

విజయ్ దేవర కొండ లేటెస్ట్ సినిమా టాక్సీవాలా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలయ్యింది. హర్రర్ జోనరే కానీ, సైకలాజికల్ టచ్ వుండే సినిమా ఇది. గీతా, యువి లాంటి పెద్ద…

విజయ్ దేవర కొండ లేటెస్ట్ సినిమా టాక్సీవాలా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలయ్యింది. హర్రర్ జోనరే కానీ, సైకలాజికల్ టచ్ వుండే సినిమా ఇది. గీతా, యువి లాంటి పెద్ద సంస్థలు నిర్మాణంలో పాలు పంచుకున్న ఈ సినిమాకు నిర్మాత ఎస్ కె ఎన్.

అర్జున్ రెడ్డి తరువాత ఏ మంత్రం వేసావె సినిమా వచ్చింది. కానీ అది ఎప్పుడో తీసి మూల పడిన సినిమా. ఆ విధంగా చూసుకుంటే అర్జున్ రెడ్డి తరువాత వస్తున్న విజయ్ దేవరకొండ సినిమా ఇదే అనుకోవాలి. 

రాహుల్ డైరక్షన్ చేసిన ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 18న విడుదలవుతుంది. ఫస్ట్ లుక్ లో పెద్దగా ఏమీ లేదు. జస్ట్ హీరో గెటప్ పరిచయం అనుకోవాలి.

సినిమా కథ అంతా ఓ కారు, ఆ టాక్సీ డ్రైవర్ విజయ్ చుట్టూ తిరుగుతుంది. పైగా కాస్త సస్పెన్స్ సినిమా కాబట్టి ఫస్ట్ లుక్ లో ఇంతకన్నా ఏమీ చూపించడానికి లేదు. టీజర్ వస్తే కాస్త ఆసక్తి కలుగుతుంది. పెరుగుతుంది.