సినిమా జనాలు అంతే. పోతే ఒకటే పొక. లేదంటే లేదు. మే 11డేట్ మీద ఇప్పుడు అలాగే పడ్డారు. ఈ డేట్ ను ముందుగా, అంటే చాలా ముందుగా అనౌన్స్ చేసుకున్నది అభిషేక్ పిక్చర్స్. ఆ సంస్థ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో నిర్మిస్తున్న సాక్ష్యం సినిమా కోసం రిజర్వ్ చేసుకుంది.
ఆ తరువాత నా పేరు సూర్య సినిమా దానికి ముందు వారానికి వచ్చి కూర్చుంది. ఇంతలో సావిత్రి బయోపిక్ మహానటి సినిమాను 9వ తేదీకి ప్రకటించారు. అక్కడితో ఆగలేదు కథ. రాజ్ తరుణ్ తో ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన రాజూగాడు సినిమాను మే 11నే విడుదల అని ప్రకటించారు.
ఇప్పుడు అసలు కథ మొదలైంది. పూరి జగన్నాధ్ తన కొడుకుతో నిర్మించిన మెహబూబా సినిమాకు కూడా మే11నే డేట్ ప్రకటించారు. ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారట. అంటే దాదాపు నాలుగు సినిమాలు ఓకే డేట్ కు కాస్త అటు ఇటుగా పడుతున్నాయన్నమాట.
సాక్ష్యం జూన్ 14
ఇదిలా వుంటే మే 11డేట్ కు వస్తున్న తొక్కిడి చూసి, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా సాక్ష్యం డేట్ ను మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా జూన్ 14న విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితే మే 11న మెహబూబా, మహానటి, రాజూగాడు పోటీ పడతాయి.
మహానటి వచ్చిన రెండు రోజులకు మెహబూబా వస్తుంది కాబట్టి ఫరవాలేదు. కానీ ఈ టోటల్ ఎపిసోడ్ లో నలిగిపోయేది రాజ్ తరుణ్ రాజుగాడే. ఆ సినిమా రెడీగా వుంది. ఏప్రియల్ 26డేట్ ఖాళీగా వుంది. ఎందుకంటే రజనీకాంత్ కాలా రావడం లేదన్న టాక్ వుంది. అలాంటి డేట్ ను వదిలేసి, ఈ పోటా పోటీ డేట్ కు రావడం ఎందుకో రాజూగాడు.