జేడీ లక్ష్మీనారాయణకు ఛాయిస్ లేదా?

సీబీఐలో సమర్థుడైన అధికారి అని ఒకపక్క, కాదు అని విమర్శలు మరోపక్క ఎదుర్కోని, వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. అది డిసైడ్ అయిపోయింది. వస్తున్నానని ఆయనే చెప్పారు. కానీ…

సీబీఐలో సమర్థుడైన అధికారి అని ఒకపక్క, కాదు అని విమర్శలు మరోపక్క ఎదుర్కోని, వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. అది డిసైడ్ అయిపోయింది. వస్తున్నానని ఆయనే చెప్పారు. కానీ ఏ పార్టీలోకి వస్తారు? ఇది ఇంకా క్లారిటీలేదు. జనసేనలోకి వస్తారని, ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి కీలక బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు అయితే వున్నాయి.

అయితే అసలు జేడీ లక్ష్మీనారాయణకు ఛాయిస్ ఏముంది?

ఎట్టిపరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరలేరు. అది వైకాపాకు బలమైన ఆయుధం అవుతుంది. అందువల్ల ఆయనకు తేదేపా అంటే అభిమానం వున్నా కూడా ఆ పార్టీలో చేరలేరు.

వైకాపా అంటే ఓ విధంగా ఆయనకు శతృత్వ పార్టీ.

భాజపాలో చేరడానికి చాన్స్ వుంది కానీ, ఆ పార్టీకి కర్ణాటకలో కీలకంగా వున్న గాలి జనార్థనరెడ్డి కేసులు, ఆ వైనాలు ఇంకా ఆయనకు వుండనే వున్నాయి.

పోనీ కాంగ్రెస్ లోకి వెళ్దామా అంటే, ఆంధ్రలో ప్రస్తుతానికి ఆ పార్టీకి జవసత్వాలులేవు. ఇక మిగిలిన ఛాయిస్ కేవలం జనసేన మాత్రమే. పైగా అక్కడ బోలెడు వేకెన్సీలు వున్నాయి. పైగా టాప్ పోజిషన్లు ఖాళీగా వున్నాయి. అదీ కాక కాస్ట్ ఈక్వేషన్లు కలిసి వస్తాయి.

అయితే భాజపానే కావాలని లక్ష్మీనారాయణ చేత రాజీనామా చేయించి, జనసేనలోకి పంపుతోందని, గవర్నర్ ఇందుకు సూత్రధారని ఓపక్క గుసగుసలు ప్రచారాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకో కీలక ప్రచారం కూడా వినిపిస్తోంది. లక్ష్మీనారాయణ తేదేపాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు అని, అందుకే ముందుగానే బాబుగారే ప్లాన్డ్ గా ఆయనను జనసేనలోకి తన మనిషిగా పంపిస్తున్నారని కూడా వినిపిస్తోంది. ఇలా వేరే పార్టీలోకి తన మనుషులను పంపడం అన్నది చంధ్రబాబుకు బాగా అలవాటని కూడా వినిపిస్తోంది.?

ఏది నిజమో? పాపం వేరే వాళ్ల వ్యవహారాలు కూపీ లాగే లక్ష్మీ నారాయణ గురించి ఇప్పుడు రాజకీయనాయకులు కూపీ లాగుతున్నారు.