మంచి, భారీ సినిమాలను అందించే నిర్మాత ఠాగూర్ మధు మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు హక్కులు తీసుకున్నారు. అది కూడా కేవలం తెలుగుకే కాదు, హిందీకి కూడా ఆయనే హక్కులు తీసుకోవడం విశేషం.
ఖాకీ సినిమా తరువాత కార్తీ-రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కార్తీ హోమ్ ప్రొడక్షన్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. సీనియర్ హీరో కార్తీక్ ఓ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు రంజిత్ రవిశంకర్ దర్శకుడు. హారిష్ జయ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టు నవంబర్ నాటికి రెడీ అవుతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ హక్కులను ఠాగూర్ మధు కాస్త గట్టి రేటుకే తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తారు. సినిమా విడుదలయిన తరువాత రెస్పాన్స్ చూసి, ప్రొడక్ట్ చూసి, హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో వున్నారు. గతంలో గజని సినిమాను ఠాగూర్ మధునే హిందీలో అమీర్ ఖాన్ తో నిర్మించారు.