ఆడియో రిలీజ్ కోసం అసెంబ్లీ సెట్

మొన్నటికిమొన్న రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం విశాఖ సాగరతీరాన భారీ సెట్ నిర్మించారు. ఏదో వేదిక నిర్మించి వదిలేయకుండా.. ఏకంగా సినిమా థీమ్ ను ప్రతిబింబించేలా చాలా వర్క్ చేశారు. 80ల నాటి గ్రామీణ…

మొన్నటికిమొన్న రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం విశాఖ సాగరతీరాన భారీ సెట్ నిర్మించారు. ఏదో వేదిక నిర్మించి వదిలేయకుండా.. ఏకంగా సినిమా థీమ్ ను ప్రతిబింబించేలా చాలా వర్క్ చేశారు. 80ల నాటి గ్రామీణ పరిస్థితుల్ని కళ్లకుకట్టేలా సెట్ వేశారు. చివరికి యాంకర్ ఇంట్రడక్షన్ కూడా ఓ చిన్న గుడిసె నుంచి వచ్చేలా ప్లాన్ చేశారు. ఎర్రటి పోస్ట్ బాక్స్, రాగి బిందెలు, మేదర బుట్టలు, ఎడ్ల బండ్లు లాంటి ఎలిమెంట్స్ ను ప్రాంగణంలో ఉంచారు. ఈ ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. ఆడియన్స్ ను భలే ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడిదే ఫార్మాట్ ను భరత్ అనే నేను సినిమా కోసం కూడా వాడబోతున్నారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది భరత్ అనే నేను సినిమా. అందుకే ఈ మూవీ ఆడియో రిలీజ్ కోసం ఏకంగా అసెంబ్లీ సెట్ వేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో త్వరలోనే ఈ ఆడియో ఫంక్షన్ ను నిర్వహించబోతున్నారు. స్టేజ్ పై సెట్ ఎలా ఉండాలి, స్టేజ్ కింద ఆహూతుల కోసం ఎలాంటి సెట్ వేయాలనే అంశంపై ఇప్పటికే స్కెచ్ లు రెడీ అయ్యాయి. 

భరత్ అనే నేను సినిమా ప్రచారం కోసం మొదట్నుంచి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఫస్ట్ లుక్ స్థానంలో ఫస్ట్ ఓథ్ అంటూ మహేష్ ప్రమాణస్వీకారం చేస్తున్న ఆడియోను విడుదల చేశారు. రీసెంట్ గా విజన్ ఆఫ్ భరత్ అంటూ టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కోసం ఏకంగా అసెంబ్లీ సెట్ వేస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఇంకెలాంటి కాన్సెప్ట్ తో వస్తారో చూడాలి. 

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ టెంపుల్ సెట్ లో రాజుసుందరం కొరియోగ్రఫీలో ఓ సాంగ్ తీస్తున్నారు. మహేష్ పంచె కట్టు స్టిల్ ఈ సాంగ్ లోనిదే. ఈనెల 25 నుంచి స్పెయిన్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.