చిరకాలంగా సౌజన్య అనే మహిళా దర్శకురాలిని తొలి సినిమా ఊరిస్తూ ఊగిసలాడుతోంది. ఆమె తయారుచేసిన ఓ స్క్రిప్ట్ నచ్చడంతో హారికహాసిని సంస్థ తమ సితార బ్యానర్ లో సినిమా చేయాలని అనుకుంది.
రకరకాల కాంబినేషన్లు వినిపించాయి కానీ, ఒక్కటీ ఫైనలైజ్ కాలేదు. ఆఖరికి నాగచైతన్యతో అదే కాంబినేషన్ సెట్ చేయాలని ట్రయ్ చేసారు. ఫైనలైజ్ అవుతుందని, ఆ దర్శకురాలని అలా వుంచారు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, నాగచైతన్య ఈసినిమా ఓకె చేయడం లేదని. ఇప్పుడున్న ఆర్డర్ లో చైతూ ఈసినిమా చేయలేనని చెప్పేసినట్లు తెలుస్తోంది. చైతన్యకు ఇప్పుడు వరుసగా సినిమాలు వున్నాయి. చందు మొండేటి, మారుతి, శివ నిర్వాణ, బాబీ ఇలా వరుసగా నాలుగు సినిమాలు ఒకె చేసినవి వున్నాయి. అందుకే సౌజన్య సినిమా చేయడం లేదని నిర్మాతలకు చెప్పేసినట్లు తెలుస్తోంది.
మరి ఈ స్క్రిప్ట్ ను హారిక హాసిని సంస్థ ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే యంగ్ హీరోలు ఎవ్వరూ ఖాళీ లేరు. చలో దర్శకుడు వెంకీ కుడుముల కూడా హారిక హాసిని సంస్థ దగ్గర ఓ సినిమాకు రెడీగా వున్నారు. దానికి కూడా హీరో కావాల్సి వుంది.