త్రివిక్రమ్-ఎన్టీఆర్ 12న ముహుర్తం

త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మించే సినిమా ఏప్రియల్ 12న ప్రారంభమవుతోంది. 12నుంచి ప్రారంభమమై నెలాఖరు వరకు సింగిల్ షెడ్యూలులో సాగుతుంది. మళ్లీ కేవలం నాలుగు రోజులు గ్యాప్…

త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మించే సినిమా ఏప్రియల్ 12న ప్రారంభమవుతోంది. 12నుంచి ప్రారంభమమై నెలాఖరు వరకు సింగిల్ షెడ్యూలులో సాగుతుంది. మళ్లీ కేవలం నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి, రెండో షెడ్యూలు స్టార్ట్ చేస్తారు.

మొదటి షెడ్యూలు మొత్తం ఇక్కడే హైదరాబాద్ లోనే వుంటుంది. ఆర్ ఎఫ్ సిలోనే కంటిన్యూగా షూటింగ్ వుండే అవకాశం వుంది. తరువాత షెడ్యూలు లోకేషన్ డిటయిల్స్ తెలియాల్సి వుంది. ఈ సినిమాను ఎలాగైనా వీలయినంత వరకు దసరా లోపు పూర్తి చేయాలన్నది ఎన్టీఆర్ సంకల్పం.

అలా అయితే ఎటువంటి పోటీలు లేకుండా దసరా బరిలో సోలోగా రావచ్చు. కాదూ అంటే మళ్లీ సంక్రాంతికి వెళ్లిపోవాలి. అలా అయితే బాలయ్య బాబాయ్ నిర్మించే ఎన్టీఆర్ బయోపిక్ అడ్డం వుంటుంది. దాంతో డేట్ లు అడ్జస్ట్ చేసుకోవాలి.

అందువల్ల తప్పని సరియితే తప్ప, సంక్రాంతికి వెళ్లకుండా చూడాలన్నది ఎన్టీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. కానీ వంద కోట్ల సినిమా అంటే సంక్రాంతి అన్నది సరైన సీజన్ అన్నది నిర్మాతల ఆలోచనగా వుంది. అయితే సినిమాను మాత్రం గ్యాప్ లేకుండా తయారుచేయడానికే షెడ్యూళ్లు వేసారు.