సుకుమార్ ఓ బ్యానర్ లో ఓ సినిమా చేసిన తరువాత మళ్లీ అదే బ్యానర్ లో సినిమా చేయడం అన్నది చాలా రేర్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఒకే బ్యానర్ లో రెండు సినిమాలు చేయబోతున్నారు. మైత్రీ మూవీస్ సంస్థలో రంగస్థలం సినిమా చేసారు సుకుమార్. ఈ సినిమా మరో పదిహేను రోజుల్లో విడుదలకు సిద్దం అయింది.
ఈ సినిమా తరువాత సినిమా కూడా సుకుమార్ అదే నిర్మాతకు మరో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన స్వంత ప్రొడక్షన్ లో సినిమా కోసం సుకుమార్ ను లాక్ చేసాడని వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదని తెలుస్తోంది. తరువాతి సినిమాను కూడా సుకుమార్ మైత్రీ మూవీస్ కే చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అంటే హారిక హాసిని బ్యానర్ ను త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ గా చేసుకున్నట్లు, మైత్రీని సుకుమార్ ఓన్ చేసుకుంటున్నారేమో? అంతా ఓకె. కానీ తరువాతి సినిమాకు సుకుమార్ కు హీరో ఎవరు రెడీగా వున్నారు? కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు. బన్నీ తప్పించి, కానీ బన్నీతో కాంబినేషన్ సెట్ అవుతుందా అన్నది అనుమానం.