ఆది సినిమా ఆగిపోయింది?

ఆది సాయి కుమార్ టైమ్ అంత బాగున్నట్లు లేదు. లవ్ లీ తరువాత సరైన హిట్ పడలేదు. హిట్ మాట దేవుడెరుగు, సరైన సినిమానే రావడం లేదు. యంగ్ హీరోలంతా ఫుల్ బిజీగా దూసుకుపోతుంటే,…

ఆది సాయి కుమార్ టైమ్ అంత బాగున్నట్లు లేదు. లవ్ లీ తరువాత సరైన హిట్ పడలేదు. హిట్ మాట దేవుడెరుగు, సరైన సినిమానే రావడం లేదు. యంగ్ హీరోలంతా ఫుల్ బిజీగా దూసుకుపోతుంటే, మనవాడు మాత్రం ఏం చేయాలా? అని చూడాల్సి వస్తోంది.

ఇలాంటి టైమ్ లో స్టార్ట్ అయిన సినిమాలు కూడా సమస్యల్లోకి వెళ్తున్నాయి. ఆ మధ్య ఆది సాయికుమార్ తో ఓ ఎన్నారై, కొత్త డైరక్టర్ తో స్టార్ట్ చేసిన సినిమా ట్రబుల్ లో పడినట్లు తెలుస్తోంది. నిర్మాతకు సలహా దారుగానో? పార్టనర్ గానో వున్న వ్యక్తి, ఝలక్ ఇచ్చి గాయబ్ అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ సినిమా ఇప్పుడు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓ సినిమా ఇలాగే మధ్యలో ఆగిపోతే, దాన్ని టేకోవర్ చేసి, డబ్బులు ఖర్చుచేసి, పూర్తిచేసి, విడుదల చేసి చేతులు కాల్చుకున్నారు సాయికుమార్.

అంతగా అనుభవం లేని వారైనా హీరో నాగశౌర్య కోసం అతని పేరెంట్స్ మాంచి స్వంత సినిమా తీసి, లైన్లోకి తెచ్చారు. అనుభవం వున్న సాయికుమార్ ఎందుకు చేయలేకపోతున్నారో?