‘రంగస్థలం’ పోస్టర్ పడింది

రంగస్థలం సినిమానే ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్. దీనికి చాలా కారణాలు వున్నాయి. సుకుమార్ లాంటి డైరక్టర్ తొలిసారి ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా చేయడం. అది కూడా 1985నాటి పీరియాడిక్ ఫిల్మ్…

రంగస్థలం సినిమానే ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్. దీనికి చాలా కారణాలు వున్నాయి. సుకుమార్ లాంటి డైరక్టర్ తొలిసారి ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా చేయడం. అది కూడా 1985నాటి పీరియాడిక్ ఫిల్మ్ కావడం. రామ్ చరణ్, సమంత విభిన్నంగా కనిపించడం. పాటలు సూపర్ గా వుండడం. ఇలా అన్ని విధాలుగా బజ్ పెరుగుతోంది.

రంగస్థలం సినిమాలో గ్రామీణ రాజకీయాలు కూడా వుంటాయని, హీరో రామ్ చరణ్ సోదరుడిగా నటించే ఆది పినిశెట్టికి కీలకపాత్ర వుందని, గ్రామీణ రాజకీయాలకు ఆ పాత్ర బలమవుతుందని గ్యాసిప్ లు వున్నాయి. ఇప్పుడు ఈ గ్యాసిప్ లకు బలం చేకూర్చే పోస్టర్ ఒకటి సోషల్ నెట్ వర్క్ లోకి వచ్చింది. ఆ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది.

ఆ పోస్టర్ లో ఆది పినిశెట్టి ఫోటో భలేగా వుంది. 1985నాటి హెయిర్ స్టయిల్. కళ్లజోడు. పేరుకే (కొణిదెల అనుకోవాలనేమో) కుమార్ బాబు. లాంతరు గుర్తుపై ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నట్లు ఆ పోస్టర్ లో వుంది. రంగస్థలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి లాంతరు గుర్తుపై పోటీ చేస్తున్న కుమార్ బాబుకు ఓటేయమని విజ్ఞప్తి వుంది అందులో.

మొత్తంమీద ఈ పోస్టర్ సోషల్ నెట్ వర్క్ రావడంతోనే రంగస్థలం సినిమాకు మరింత బజ్ వచ్చింది. సినిమా మీద ఆసక్తిని పెంచింది.