సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంత హిట్ అయిందో, ఆ సినిమాలో బంగార్రాజు పాత్ర అంత పాపులర్ అయింది. అప్పట్లోనే నాగార్జున చెప్పేసాడు బంగార్రాజు పాత్రతో సినిమా చేస్తానని. అన్నపూర్ణ బ్యానర్ కు రెండు హిట్ లు ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ నే డైరక్టర్.
ఇంతకీ లేటెస్ట్ సంగతేమిటంటే, ఈ ఏడాదిలోనే ఎలాగైనా బంగార్రాజు సినిమా పూర్తి చేయాలని నాగ్ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ చేస్తున్న రవితేజ సినిమా పూర్తయిపోగానే బంగార్రాజు మీదకు వెళ్తారు. అలాగే నాగ్ చేయబోయే నాని మల్టీస్టారర్ పూర్తి చేసి బంగార్రాజు మీదకు వస్తారు.
వీలయితే 2019సంక్రాంతికి బంగార్రాజును విడుదల చేయాలన్నది నాగ్ ఆలోచనగా తెలుస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది చివరకు అన్నపూర్ణ బ్యానర్ పైనే నాగచైతన్యతో ఓ కొత్త డైరక్టర్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ చేస్తారట. అంటే 2019లో అన్నపూర్ణ బ్యానర్ సినిమాలు రెండు వుంటాయన్నమాట.