సమ్మర్ సినిమాల తాకిడి పెరుగుతోంది. 16న చాలా సినిమాలు వున్నా, కిర్రాక్ పార్టీ, దండుపాళ్యం, ఐతే సినిమాలు కీలకంగా వున్నాయి. 23న ఎమ్మెల్యే ఒకటే అనుకుంటే, నీదీ నాదీ ఒకటే కథ వచ్చి చేరింది. దీనికి తోడుగా రాజరథం కూడా ఫిక్సయింది. అంటే రెండు వారాలూ కూడా మూడేసి సినిమాలు కీలకంగా వున్నాయి.
కేవలం మార్చి నెలాఖరు డేట్ కు వచ్చే రంగస్థలం సినిమాను మాత్రం సోలో గా వదలక తప్పలేదు అన్నమాట. అదే విధంగా ఆ మరుసటి వారం కూడా వదిలేసారు పెద్ద సినిమా కాబట్టి, మళ్లీ ఏప్రియల్ రెండో వారం నుంచి మామూలే.
రాజరథం సినిమా ఎలా వుంటుందన్నది, జోనర్ ఏమిటన్నది ఇప్పటికి తెలియదు కానీ, పబ్లిసిటీ మాత్రం ఓ లెక్కలో చేస్తున్నారు. రానాను కూడా పబ్లిసిటీలో వాడేస్తున్నారు. కానీ అసలు సినిమా ఏమిటో? దాని వైనం ఏమిటో అన్నది మాత్రం ఇంకా ఏమీ చెప్పడం లేదు.