మహానటి సినిమా కీలక సంగతులు చిరకాలంగా లీక్ అవుతూనే వున్నాయి. నిన్నటికి నిన్న నాగచైతన్య మహానటి సినిమాలో అక్కినేనిగా నటించబోతున్నారన్న వార్త బయటకు రావడంతో యూనిట్ అలెర్ట్ అయింది. నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ ఈ విషయమై ఆరా తీయడం ప్రారంభించారట.
అసలు ఆది నుంచీ మహానటి విషయాలు ఎలా లీక్ అవుతున్నాయన్న దానిపై స్వప్న యూనిట్ జనాలను అడిగారట. సినిమాకు పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తి నుంచి లీక్ లు అవుతున్నాయని స్వప్న దత్ కు ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఇప్పటిదాకా మీడియా జనాలకు ఆ వ్యక్తి నుంచే లీకులు వెళ్లాయని యూనిట్ సభ్యులు స్వప్న దత్ దగ్గర అనుమానం వ్యక్తం చేసారట. ఆమె కూడా 'తనకు అదే అనుమానం వుందని, కానీ ఆ వ్యక్తి అలా చేస్తారా' అన్న అభిప్రాయంతో వున్నానని అన్నారట.
ఇకపై ఈ విషయంలో ఎలా కట్టుదిట్టం చేయాలా? అన్నదానిపై కూడా స్వప్న దత్ సమాలోచనలు సాగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఇంకా నాగచైతన్యతో అగ్రిమెంట్ కాలేదని, జస్ట్ ఓరల్ గా ఓకె చేయడం అయిందని, ఇలా లీక్ అయితే మళ్లీ ఏదైనా తేడావస్తే సినిమాకు కష్టం అవుతుందని స్వప్న దత్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ లీకు వీరుడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారట.