17న కర్నూలులో ఎమ్మెల్యే

ఆడియో ఫంక్షన్లకు కొత్త కొత్త వెన్యూలు వెదుకుతున్నారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ఇలా సెకెండ్ క్లాస్ అర్బన్ సెంటర్లలో ఆడియో ఫంక్షన్లు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే సినిమాకు కూడా…

ఆడియో ఫంక్షన్లకు కొత్త కొత్త వెన్యూలు వెదుకుతున్నారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ఇలా సెకెండ్ క్లాస్ అర్బన్ సెంటర్లలో ఆడియో ఫంక్షన్లు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే సినిమాకు కూడా ఇలాంటి వెన్యూనే సెలెక్ట్ చేసారు.

ఈనెల 17న కర్నూలులో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే ఫంక్షన్ నిర్వహిస్తారు. కాజల్ జంటగా ఉపేంద్ర డైరక్షన్ లో పీపుల్స్ మీడియా, బ్లూ ప్లానెట్ సంస్థలు కలిసి నిర్మించిన ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) ఈ నెల 23న విడుదలకు షెడ్యూలు చేసారు.

ఈ సినిమాలో ఒక్క పాటను మాత్రం విడుదల చేసారు. మిగిలిన పాటలు, ట్రయిలర్ ను 17న ప్రీ రిలీజ్ కమ్ ఆడియో ఫంక్షన్ లో విడుదల చేస్తారు.

శ్రీనువైట్ల దగ్గర చిరకాలం పనిచేసిన ఉపేంద్ర అందించిన ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో ఎమ్మెల్యే సినిమా రూపొందించారు. ఈ సినిమా కోసం పూర్తిగా సాఫ్ట్ లుక్ తో కొత్తగా మేకొవర్ అయ్యాడు కళ్యాణ్ రామ్. విడుదలకు ముందే ఇటు శాటిలైట్, డిజిటల్, అటు థియేటర్లు రైట్లు అన్నీ అమ్ముడై, టేబుల్ ఫ్రాఫిట్ ఇచ్చింది నిర్మాతలకు ఈ సినిమా.

ఎమ్మెల్యే ఫొటోస్ కోసం క్లిక్ చేయండి