ఆ డైరక్టర్ ఆ క్యాంప్ ను వదిలేసాడు

సురేష్- గీతా, ఈ క్యాంప్ లోకి వెళ్లడం, అక్కడ సబ్జెక్ట్ ఓకె చేయించుకోవడం, స్క్రిప్ట్ తయారుచేయడం, ఫైనల్ గా సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేయడం అన్నది అంత ఈజీ టాస్క్ కాదు. నెలల…

సురేష్- గీతా, ఈ క్యాంప్ లోకి వెళ్లడం, అక్కడ సబ్జెక్ట్ ఓకె చేయించుకోవడం, స్క్రిప్ట్ తయారుచేయడం, ఫైనల్ గా సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేయడం అన్నది అంత ఈజీ టాస్క్ కాదు. నెలల తరబడి వుండి. వుండి. ఆఖరికి బయటకు వచ్చేసే వాళ్లు చాలా మంది వుంటారు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయాడు.

వెంకీతో సినిమా కోసం సురేష్ క్యాంప్ తో చాలా కాలంగా వున్నట్లు ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. కానీ వెంకీ ఓ సినిమా తేజతో మరో సినిమా త్రివిక్రమ్ తో, అది కాక అనిల్ రావిపూడితో మరోటి ఒకె చేసాడు. మరి బొమ్మరిల్లు భాస్కర్ కు చోటెక్కడ?

అందుకే ఇప్పుడు బయటకు వచ్చేసాడు. గోపీచంద్ కు కథ చెప్పి, మెప్పించే ప్రయత్నంలో వున్నాడు. గోపీచంద్ ఒకె అంటే నిర్మాతతో సమస్య లేదు. రెడీగానే వున్నారు ఒకరిద్దరు.