రాజకీయవారసుడిగా ‘దేవరకొండ’

అర్జున్ రెడ్డిలో పీకల్లోతు ప్రేమలో పడిన మెడికోగా కనిపించిన విజయ్ దేవరకొండ తరువాత సినిమాలు కూడా వైవిధ్యంగానే వుండేలా చూసుకుంటున్నాడు. గీతా4 పతాకంపై నిర్మించిన టాక్సీవాలా హర్రర్ జోనర్. Advertisement ఆ తరువాత పరుశురామ్…

అర్జున్ రెడ్డిలో పీకల్లోతు ప్రేమలో పడిన మెడికోగా కనిపించిన విజయ్ దేవరకొండ తరువాత సినిమాలు కూడా వైవిధ్యంగానే వుండేలా చూసుకుంటున్నాడు. గీతా4 పతాకంపై నిర్మించిన టాక్సీవాలా హర్రర్ జోనర్.

ఆ తరువాత పరుశురామ్ (బుజ్జి) డైరక్షన్లో పూర్తయిన సినిమా ఫ్యామిలీ జోనర్. ఆపైన మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా స్టూడెంట్ యూనియన్లు, రాజకీయాలు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆనంద్ శంకర్ డైరక్షన్లో తమిళ నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా నిర్మించే సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్.

ఈ సినిమా ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. వరుస సినిమాలతో బిజీగా వున్నా కూడా విజయ్, డైరక్టర్ ఆనంద్ శంకర్ చెప్పిన పాయింట్ కు ఫిదా అయిపోయాడట. 

రాజకీయ నాయకుడైన తండ్రి, తన కొడుకును ఏ విధంగా రాజకీయాల్లోకి లాగాడు, ఆ తండ్రి కొడుకుల మధ్య కాన్ ఫ్లిక్ట్, వర్తమాన రాజకీయాలు కలిసి కథ తయారుచేసుకున్నాడట దర్శకుడు.

అందుకే వెంటనే అడ్జస్ట్ చేసి డేట్ లు ఇచ్చేసాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ సినిమాలు మూడు రెడీగా వున్నాయి విడుదలకు. ఒకటి ఎప్పుడో ఎర్లీ స్టేజ్ లో నిర్మించిన ఏ మంత్రం వేసావే. రెండవది టాక్సీవాలా. మూడవది గీత గోవిందం (పరిశీలనలో వున్న టైటిల్).