గ్లోబల్ చార్ట్ లో విశాఖ

విశాఖను ప్రపంచ పటంలో పెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. విశాఖకు ఆ కెపాసిటీ పొటెన్షియాలిటీ ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. సౌతిండియాలోనే అతి పెద్ద ఇనార్బిట్ మాల్ ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని…

విశాఖను ప్రపంచ పటంలో పెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. విశాఖకు ఆ కెపాసిటీ పొటెన్షియాలిటీ ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. సౌతిండియాలోనే అతి పెద్ద ఇనార్బిట్ మాల్ ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని జగన్ చెప్పడం జరిగింది.

హైదరాబాద్ లో ఇనార్భిట్ మాల్ ఏడు ఎకరాలలో మాత్రమే ఉందని, విశాఖలో రెట్టింపు స్థలంలో ఏర్పాటు అవుతోంది అని గుర్తు చేశారు. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్ వచ్చింది, ఇన్ఫోసిస్ ఆఫీస్ తెరచింది. ఇపుడు రహేజా కూడా రెండున్నర లక్షల ఎస్ ఎఫ్ టీ లో ఐటీ స్పేస్ ని ఏర్పాటు చేస్తోంది.

విశాఖలో సెవెన్ స్టార్ హొటల్స్ నిర్మాణానికి రహేజా ముందుకు వచ్చింది. గత నెలలోనే ఓబెరాయ్ యాజమాన్యం ఆద్వర్యంలో భీమిలీ వద్ద ఫైవ్ స్టార్ హొటల్ నిర్మాణానికి పునాది రాయిని జగన్ వేశారు. విశాఖలో రానున్న రోజులలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. 

విశాఖ రూపు రేఖలు ఈ అభివృద్ధితో సమూలంగా మారుతుందని జగన్ చెప్పడం విశేషం. ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళానికి మూలపేట సీ పోర్టు ఉంటే విజయనగరంలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఉందని, విశాఖలో వరసగా పరిశ్రమలు ప్రాజెక్టులు వస్తున్నాయని ఆయన వివరించారు.

విశాఖ ఖ్యాతిని పెంచే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అంటున్నారు. ఏయూలో చూస్తే సిలికాన్ వ్యాలి మాదిరిగా విద్యార్ధులు చదువుతో పాటే స్టార్టప్ లను స్థాపించడానికి అవసరం అయిన శిక్షణ, అలాగే పరిశోధనలకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఒక్క రోజులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ విశాఖ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ని మరోసారి చాటి చెప్పారు.