సినిమా అయినా అడ్వాన్స్ అయినా ఆర్నెల్ల తరువాతే

పవన్ కళ్యాణ్ తరువాతి సినిమా ఎప్పుడు? అసలు సినిమా వుంటుందా? వుండదా? సినిమాలు చేయకుంటే తీసుకున్న కోట్ల రూపాయల అడ్వాన్స్ ల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలు గత కొద్ది కాలంగా వినిపిస్తూనే వున్నాయి.…

పవన్ కళ్యాణ్ తరువాతి సినిమా ఎప్పుడు? అసలు సినిమా వుంటుందా? వుండదా? సినిమాలు చేయకుంటే తీసుకున్న కోట్ల రూపాయల అడ్వాన్స్ ల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలు గత కొద్ది కాలంగా వినిపిస్తూనే వున్నాయి. కానీ సమాధానాలు మాత్రం తెలియడం లేదు. అన్నింటా మీద సందేహాలే. అయితే లేటెస్ట్ గా ఈ విషయంలో కొత్త అప్ డేట్ తెలిసింది.

మైత్రీ మూవీస్ పార్టనర్ ల్లో ఒకరైన నవీన్ ఇటీవల ఇండియాకు వచ్చారు. రంగస్థలం విడుదల వరకు ఆయన ఇక్కడే వుంటారు. పనిలో పనిగా పవన్ ను కలిసి, ఆ సినిమా గురించి కూడా మాట్లాడతారని వార్తలు కూడా వచ్చాయి. మరి ఆయనే కలిసారో? లేక మధ్యవర్తిగా మొదటి నుంచి వున్న త్రివిక్రమ్ ద్వారా కబురు చేసారో? మరెలో కన్వే చేసారో కానీ, పవన్ చాలా తెలివైన, కాదనలేని, ఏమీ చేయలేని సమాధానం సినిమా గురించి చెప్పినట్లు తెలుస్తోంది.

'ఇప్పుడు సినిమా చేయలేను.. ఆరు నెలల తరువాత అయితే చేసే అవకాశం వుంది. ఒకవేళ అప్పుడు చేయలేకపోతే మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాను. లేదు అడ్వాన్ ఇప్పుడే కావాలన్నా చెప్పండి ఇచ్చేస్తాను' ఇంచు మించు ఈ విధంగా పవన్ నుంచి మైత్రీ మూవీస్ కు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ లాంటి హీరో దగ్గర రెండేళ్ల బట్టి 9-12 కోట్ల మధ్యలో అడ్వాన్స్ రూపంలో డబ్బులు వుంచేసిన వారు ఇప్పుడేం చెబుతారు? ఆరునెలల తరువాత చేసే అవకాశం వుంది అన్నారు కాబట్టి, సైలెంట్ గా అలాగే అనాల్సిందే. తీసుకునేదేదో ఆరునెలలు ఆగి తీసుకోవాల్సిందే. లేదు అలా కాకుండా మొహమాటం లేకుండా, సరే వద్దు, ఇప్పుడే అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయండి అని అనలేరు కదా? ఆ విధంగా మరో ఆరునెలలు వడ్డీలేని అడ్వాన్స్ వుంటుందన్న మాట పవన్ దగ్గర.

మైత్రీ వాళ్లు మొహమాట పడతున్నారు కానీ, ఇదే హారిక చినబాబు అయితే, వెంటనే అడ్వాన్స్ అడిగి తెచ్చేసుకుంటారు వెనక్కు అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ఆ విధంగానే మహేష్ బాబు దగ్గర నుంచి అడ్వాన్స్ అడిగి వెనక్కు తెచ్చుకున్నారు.